ప్రకృతికి దగ్గరగా, ప్రకృతితో కలిసి నడవాలని చెప్పే ఆచరణీయమైన, ఆదర్శనీయమైన విషయం చెబుతుంది. అందుకు ఇటీవల అందరూ మట్టి
పాత్రలపై దృష్టి సారించారు. పసుపు పవిత్రతకు చిహ్నంగా భావిస్తాం. యాంటీబయోటిక్ అని ఆధునిక పరిశోధకులూ
గుర్తించారు. బోనంలో ఉన్న ఆహారం శుద్ధిగా ఉండాలనే కుండ చుట్టూ పసుపు రాస్తారు. అమ్మ వారి ఆహార్యం, ఆచరించే నియమాలు.. అన్నింట్లో శాస్త్రీయత ఇమిడి ఉందని
ఉస్మానియా విశ్వవిద్యాయంలో బోనాలపై పీహెచ్‌డీలు చేసిన విద్యార్థులు
వెల్లడిస్తున్నారు.
బోనంలో ఉండే పసుపన్నం వల్ల కాలేయ సమస్యలు రావని వైద్యులు తెలిపారు. ఇలాంటి సామూహిక వేడుకల్లో పసుపన్నం తినడం వల్ల ఎలాంటి జీర్ణకోశ సమస్యలు రావు. గాల్‌బ్లాడర్ పనితీరు మెరుగవుతుంది. మెదడు
చురుకవుతుంది. బోనం అలంకరణలో, సాక కోసం పసుపు నీటిలో వేపాకును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కీలకంగా వాడే వేపాకు వల్ల గాలి శుద్ధి అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది, కంటి సంరక్షణకు తోడ్పడుతుంది. క్యాన్సర్, ప్లూ జ్వరాలు తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Comments
Post a Comment