సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ‘పుష్యమాస అమావాస్య’ ను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఎంతో మంచిరోజు అని హిందువులు భావిస్తారు. ఆ రోజున తమ పితృ దేవతలకు తర్పణాలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. ‘పుష్యమాస అమావాస్య’ నాడు మౌనవ్రతం పాటించడ0 ముక్యం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో వచ్చే పుష్య,మాఘ మాసాల సూర్యకిరణాల్లో ఆరోగ్యకారకాల మోతాదు ఎక్కువగా ఉంటుందని మన ధార్మిక గ్రంథాలే కాదు ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. ప్రవాహపు నీటిలోనే కాదు సూర్యరశ్మి సోకే నదీజలాలు, బావిలో ఉండే నీరు ఇలా వేటిలో స్నానం చేసినా ఆరోగ్యపరంగా ఎంతో మంచిదంటారు మన పెద్దవాళ్ళు. ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య శ్రవణా నక్షత్రం కలిసాయి కాబట్టి ఇది మహోదయ అమావాస్య. ఎంతో మహత్తరమైన రోజు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com