Skip to main content

స్వర్గ ప్రాప్తి కి మొక్కలు నాటాలి

 

 

 


మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది. 
శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు.
పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు
మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.
వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.
శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı
మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı
ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి. మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.
వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది. మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి. మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం. నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం.

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.