కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు.
సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది.
కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి.
సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంతో ఉంటారు. ఆ రోజు సాయంకాలం పశువులకు పొంగలి నైవేద్యం పెడతారు.
పశువుల పాకలను ఈరోజు వ్యవసాయదారులు మాత్రమే శుభ్రం చేసి పశువులను కడుగుతారు. మిగతా రోజులలో వేరే వారు చేసినా ఈ రోజు ఆపని ఎవరికి వారే చేసుకుటాంరు. సాధారణంగా ఈరోజు రైతులు మాంసాహారం తప్పకుండా తింరు. తమ యజమాని మాంసాహారం తినేవారైతే అక్కడే భోజనం చేస్తారు. ఒకవేళ తమ యజమానులు శాఖాహారులైతే కనుక వారు ఇచ్చే బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు అన్నీ ఇంటికి తీసుకువెళ్ళి మాంసాహారం ఇంటిలో వండుకునే తినే సంప్రదాయం కూడా ఉన్నది.
ఈ రోజుననే పశువులకు పందేలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నది. ఇవి అన్నీ కూడా తాము ఇన్ని రోజుల నుంచి కష్టపడిన వాటికి ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయం, పశువులు ఏపుగా ఉండే సమయం కాబట్టి అందరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుటాంరు.
వ్యవసాయ దారుడికి పశువులే ధనం. వాటి శ్రమ మూలంగా ఆ సంవత్సరం పంట చేతికి వచ్చిన సందర్భంగా కృతజ్ఞతా సూచకంగా వాటికి కొత్త బియ్యంతో పొంగలి వండిపెట్టే ఆచారం ఏర్పడింది. పాడి పంటలు అనే జంట పదాల్లో పాడి శబ్దం ముందు ఉంచబడింది. అంటే ఒక విధంగా పంట కంటే కూడా పాడి ప్రయోజనమైనదన్నమాట. ఇది ఒక విధంగా కృతజ్ఞతను తెలిపే పర్వం. పంటలు పండింపచేసే భగవంతుడికి పొలాన్ని దున్నే ఎద్దులకి అందరికీ కృతజ్ఞతలు తెలిపే పండుగగా దీనిని జరుపుకుటాంరు.
ఈ సంక్రాంతి పండుగ పట్టణాలలో కంటే కూడా గ్రామాలలో ఎక్కువగా ఆనందంగా జరుపుకుటాంరు.
ఈరోజుతో సంక్రాంతి ఉత్సవాలు పూర్తి అవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాల సమయాన సంక్రాంతి రోజునుంచి ప్రతి ఒక్కరు వారి వారి స్థాయికి తగినంత నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉత్తరాయణం 6 నెలలు కూడా దైవారాధనకు ధర్మ కార్యాక్రమాలను అనువైన సమయంగా భావించి వారి వారి కర్మదోషాలను తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేయాలి.
ఈ రోజున పెరుగుదానం చేయడం విశేషమైన ఫలితంగా భావిస్తారు. దానం చేయాలనే ఆలోచన రావడమే మంచిది. వచ్చిన ఆలోచనను అమలు చేయడం ఇంకా ఉత్తమమైన ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి పెరుగును ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజుల్లోనూ తప్పకుండా దానం చేయాలి. దానివలన అనంతమైన ఐశ్వర్యం లభిస్తుంది.
Comments
Post a Comment