తిరునక్షత్రము: ఆషాడ మాసము (ఆని), స్వాతి 29-6-2023
అవతార స్థలము: శ్రీవిల్లిపుత్తూర్
ఆచార్యులు~: విష్వక్సేనులు
శ్రీ సూక్తులు: తిరుప్పల్లాణ్డు, పెరియాళ్వార్ తిరుమొళి
పరమపదము చేరిన ప్రదేశము: తిరుమాలిరుంశోలై
పెరియవాచ్చాన్ పిళ్ళై తన తిరుపల్లాండు అవతారికలో పెరియాళ్వార్ వైభవాన్ని కీర్తించారు. వీరి యొక్క అవతార ప్రయోజనం, ఈ సంసార దుఃఖములను అనుభవిస్తున్న జీవాత్మలను ఉజ్జీవింపచేయడం. ఎంపెరుమాన్ కృపచే పెరియాళ్వార్ సహజముగానే పెరుమాళ్ యందు దాస్యకైంకర్యం అను దానిచే అలంకరిపబడిరి. తమ జీవితాన్ని ఎంపెరుమాన్ కు కైంకర్యము చేయడానికి మరియు శాస్త్ర నిర్ణయం చేసి ఉత్తమ కైంకర్యమును ప్రవర్తింప చేయడానికి వినియోగించాలనుకున్నారు.శ్రీకృష్ణుడు కంస సభకు వెళ్ళేముందు మథురలోని మాలకారుని గృహమునకు వెళ్ళి ఉత్తమ పూమాలను కోరగా, మాలకారుడు ప్రేమతో మరియు ఆనందముతో మాలను సమర్పించగా శ్రీకృష్ణుడు చాలా ఆనందముతో దాని ధరించాడు.దీనిని గుర్తించిన పెరియాళ్వార్, పెరుమాళ్ కు మాలాకైంకర్యం చేయడమే ఉత్తమ కైంకర్యముగా భావించి, ఒక నందనవనము పెంచి దానినుండి వచ్చు పూలచే శ్రీవిల్లిపుత్తూర్ పెరుమాళ్ కు ప్రతిరోజు అత్యంత ప్రీతిచే మాలాకైంకర్యము చేయసాగిరి.
పెరియాళ్వార్ కు ఇతర ఆళ్వార్లకు చాలా వ్యత్యాసమున్నది. ఇతర ఆళ్వార్లు తమ కైంకర్యమును (ఎంపెరుమాన్ యందు వారిది నిత్య కైంకర్యము)తమ ఆనందమునకై చేయగా , పెరియాళ్వార్ మాత్రం తమ గురించి కాక కేవలం ఎంపెరుమాన్ ఆనందమునకై (జీవాత్మలకు పరమపదమునందు ఎంపెరుమాన్ కు నిత్య కైంకర్యము చేయాలని)మాత్రమే తమ కైంకర్యమును చేసిరి.ఇతర ఆళ్వార్లు, ఈశ్వరుడే రక్షకుడని మరియు వాని రక్షణచే తమ భయములను పోగొడతాడని భావించారు. కాని పెరియాళ్వార్, ఆ ఈశ్వరుడు రక్షకుడు మరియు రక్షింపబడే వాడుకూడా అని భావించారు. పిళ్ళైలోకాచార్యులు మరియు మామునులు అన్నీ ప్రబంధముల కన్నా తిరుపల్లాండు విధిగా కీర్తించబడిందని తెలిపారు.
Comments
Post a Comment