నల్లని నువ్వులు ౫౦ గ్రాములు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం ౫౦ గ్రాములు, గంధం 20 గ్రాములు,, ఆవు నెయ్యి 50 గ్రాములు, ఆవు పంచికం, ఆవు పేడ కొంచెం, బియ్యం పిండి ౧/౨/ kg., ఆవు పాలు, పెరుగు, తేనె, బెల్లం పొడి, ( అన్నీ కలిపి ౧౦౦ millilitre), అరటి పండ్లు ౬ ,తెల్లని వస్త్రం, ఆచమనం పాత్ర, రాగి కలశం చెంబు 1, తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం, జంజం 1, స్వయం పాకం 3పాకెట్లు, (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.ఆల్వార్, ఏమ్బెరుమానార్, జీయర్ దక్షిణ Rs.2,000/-
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment