Skip to main content

ఉత్పన్న ఏకాదశి తేదీ 15-11-2025 శనివారం

 ఈ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. హిందువులు ఈ ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. ఈరోజునే దుర్గాదేవి ముర అనే రాక్షసుడుని సంహరించి ఏకాదశి మాతగా పిలువబడింది. ఈరోజున శ్రీమహావిష్ణువుతోపాటు తులసి దేవిని పూజిస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల మీ యెుక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి.

ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 15 నవంబర్ 2025న రాత్రి 12:49కి ప్రారంభమై..నవంబర్ 16న రాత్రి 2:37కి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకోనున్నారు. ఉత్పన్న ఏకాదశి నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండబోతుంది. దీంతోపాటు విష్కుంభ యోగం కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ఏకాదశికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. పైగా ఇదే రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:27 వరకు ఉంటుంది.

ఈ ఏకాదశి వ్రతాన్ని పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పాటిస్తారు. దీని వల్ల మీ జీవితంలో శాంతిపాటు ఆనందం కూడా ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణువుకు పసుపు రంగు వస్తువులను సమర్పించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్దిగా ఉపవాసం చేయలేకపోతే ఉదయాన్నే తేలిక పాటి ఆహారాన్ని తీసుకోండి. ధాన్యాలు, బియ్యం వంటి తీసుకోవడం మానుకోండి. మనస్సును దేవుడిపై లగ్నం చేసి ప్రశాంతంగా ఉండండి.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.