Skip to main content

మోహినీ ఏకాదశి తేదీ 27-4-2026 సోమవారం

 వైశాఖ శుద్ధ ఏకాదశి ఈ రోజునే మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా మోహినీ అవతార విశిష్టత తెలుసుకుందాం. 'మోహిని' అంటే మోహింపజేసేది అని అర్థం. హిందూ పురాణాలలో మోహిని అవతారం శ్రీమహావిష్ణువు ధరించిన అత్యంత విశిష్టమైన, ఏకైక స్త్రీ అవతారం.

మోహిని ఏకాదశి ఇలా వచ్చింది
శ్రీహరి మోహిని అవతారాన్ని స్వీకరించింది వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు. ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం. పరమ పవిత్రమైన ఈ మోహిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, శ్రీహరిని పూజించాలి. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో లేచి నదీస్నానం చేయాలి. అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పువ్వులు, తులసి దళాలతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మామిడి పండ్లు, కొబ్బరికాయ, చక్రపొంగలి వంటి నైవేద్యాలు సమర్పించాలి. అనంతరం కర్పూర హారతిచ్చి నమస్కరించుకోవాలి. ఈ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. సంధ్యా సమయంలో తిరిగి పూజ చేసి క్షీరసాగర మథనం ఘట్టాన్ని, శ్రీహరి మోహిని అవతార విశిష్టతను పారాయణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే నిత్య పూజ పూర్తి చేసి ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు.

ఈ దానాలు శ్రేష్టం
మోహిని ఏకాదశి రోజు పేదలకు అన్నదానం చేయడం మహా ఫలదాయకమని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మామిడి పండ్లు, జలదానం, ఛత్రం, పాదరక్షలు వంటివి కూడా దానం చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సుమేరు పర్వతం అంతటి పాపాలు కూడా తొలగిపోతాయని, భక్తులు మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-