Skip to main content

అధిక జ్యేష్ఠ మాసం ఈ ఏడాది మే 17వ తేదీ ఆదివారం నుంచి వచ్చే నెల 15వ తేదీ సోమవారం వరకు అధిక జ్యేష్ఠ మాసం


Sri Vishnu
(ఫోటోలు- iStock)
Adhika Jyeshta masam 2026 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, వైశాఖ మాసం తర్వాత జ్యేష్ఠ మాసం వస్తుంది. అయితే సూర్య సిద్ధాంతం, బ్రహ్మ సిద్ధాంతం తదితర గ్రంథాల ప్రకారం, ఏ చాంద్రమాసంలో సూర్య సంక్రాంతి కనిపించదోఆ కాలాన్ని ‘అధిక మాసం’గా పరిగణిస్తారు. దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక ఏడాదికి 365 రోజులు 6 గంటల 11 సెకన్లు. అయితే ఒక చాంద్రమానం ప్రకారం ఒక ఏడాదికి 354 రోజుల సుమారు 9 గంటలు మాత్రమే ఉంటుంది. ఈ రెండు మాసాల మధ్య సమన్వయం కల్పించేందుకు భారతీయ శాస్త్రకారులు ‘అధిక మాస’ వ్యవస్థను రూపొందించినట్లు ప్రముఖ పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్త మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో ప్రతిరోజూ స్నానం చేసిన అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. 
 జ్యేష్ఠ శుక్ల పక్షం, రెండో పక్షం అయిన క్రిష్ణ పక్షంలో ఎలాంటి సంక్రాంతి లేకపోవడంతో ఈ జ్యేష్ఠ మాసాన్ని అధిక మాసంగా పరిగణించనున్నారు. ఈ లెక్కన ఏ ఏడాదిలో అయిన రెండు జ్యేష్ఠ మాసాలు వస్తాయో ఆ సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య విభేదాలు రావొచ్చు. రాజకీయంగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రముఖ నాయకులు మరణం లేదా పదవీ కోల్పోవడం, హింసాత్మక ఘటనలు జరగొచ్చు. ప్రజలు కొత్త రోగాల బారిన పడచ్చు. పూజా కార్యక్రమాలు, దానధర్మాల కార్యక్రమాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

అధిక జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పనులు
 అధిక జ్యేష్ఠ మాసంలో వేణుమాధవుడిని స్మరించుకుంటూ స్నానం చేసిన అనంతరం ఉపవాస దీక్ష కొనసాగిస్తూ పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి. అధిక మాసంలో విష్ణుమూర్తి స్వరూపుడిగా భావించే సూర్యుడిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి. అనంతరం మీ శక్తి, సామర్థ్యాల మేరకు ధాన్యం, పండ్లు, దుస్తులు దానం చేయాలి. అలాగే నెలాఖారులో బెల్లం, నెయ్యి వంటి వాటిని దానం చేయాలి.
ఈ మంత్రాలను పఠించాలి
కేశవం మాధవం రామమచ్యుతం పురుషోత్తమమ్
వాసుదేవం జగద్యోనిమనంతం శేషశాయినమ్
జనార్దనం ధరావాసం దామోదరమధార్దనమ్
గోవిందం వామనం శ్రీశం శ్రీక్రిష్ణం విశ్వసాక్షిణమ్
ఈ పనులు చేయకూడదు
* అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు.
* అయితే కొన్ని అత్యవసర కర్మలు చేయొచ్చు.
* వివాహ కార్యక్రమాలు, విహారయాత్రలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం చేయకూడదు
* కొత్త వాహనం, కొత్త ఆభరణాలు, కొత్త బట్టలు వంటివి తీసుకోకూడదు.
* కొత్త భూమి, కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు నష్టపోవాల్సి రావొచ్చు.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-