Skip to main content

Importance of Abhijith lagnam & its story.

అభిజిత్ నక్షత్రం
మనకు తెలియని మరో నక్షత్రం! బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణజన్మ ఖండం తొంభై ఆరో అధ్యాయంలో ఉన్న విషయం.
నక్షత్రాలు మొత్తం ఇరవై ఏడు. ఇవన్నీ దక్షప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లిచేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువకాలం గడుపుతుండేవాడు. ఓసారి వసంత రుతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ­రుకున్నా శ్రవణా నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్లింది. ఆ శ్రవణా నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దానిపేరు అభిజిత్తు.
అలా ఇరవైఏడు నక్షత్రాలే కాక అభిజిత్తు అనే ఇరవై ఎనిమిదో నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలాలలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, ఒకటికి రెండుసార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించినా చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించటం ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్తు మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది.
అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో "గడ్డపలుగు"ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యే మిట్ట మధ్యాన్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడటం రాని పల్లె ప్రజలకు ఎటువంటి గందరగోళం లేకుండా స్ధూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమకేంద్రంలో ఉంటాడని ఈ యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు.
అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11-45నుండి 12-30వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ముహూర్తం అని, సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి ఎనిమిదవ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అంటారు. పగటి భాగం లో ఎనిమిదవ ముహూర్తం ఇది .దీనికే ‘’విజయ ముహూర్తం ‘’అంటారు. ఈ అభిజిత్ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం మొదలు పెట్టారు. ఈ శుభ ముహూర్తం లోనే దేవరాజు ఇంద్రుడు దేవ సింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది . ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తం లో జరిగాయి.
అభిజిత్ లగ్నం (మధ్యాహ్న లగ్నం) లో పెళ్ళి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతటి దివ్యమైన ముహూర్తం ఇది.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-