The Sun God Birth day on 14-2-2016.
ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున సంభవించే సూర్య జయంతి సందర్భంగా ఈ ఏడు రేపు అనగా 14-02-2016 న రథసప్తమి కి గాను ఒక్కరోజు బ్రహ్మొత్సవంగా పిలిచే రథసప్తమి వేడుకకు కలియుగ పరిపాలకుడు,ప్రత్యక్ష దైవము శ్రీనివాసుని క్షేత్రం తిరుమల సిద్దమైంది.
మాఘశుద్ధ సప్తమి రోజున పుష్కరిణి స్నానం చాలా పవిత్రమైనది భక్తుల విశ్వాసం. చక్రస్నానం సమయానికి పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి భక్తులు పోటెత్తుతారు. సర్వాలంకార భూషితుడైంనా మలయప్ప స్వామి సప్తవాహనాల పై రేపు అనగా 14-02-2016 ఆదివారం ఒక్కరోజే తిరువిదులలో ఊరేగుతూ భక్తులకు అనుగ్రహం కలిగిస్తూ దర్శనమివ్వనున్నారు.
సాధారణంగా 9 రోజులు పాటు జరిగే బ్రహ్మొత్సవాలలో స్వామివారు రోజుకు రెండుచొప్పున అనగా ఉదయం,సాయంత్రం 16 వాహనాలపై ఊరేగడం పరిపాటి అందులోనూ ఈ ఏడు అధిక మాసం రావడం వలన శ్రీనివాసుని రెండు బ్రహ్మొత్సవాలు నిర్వహించడం జరిగింది.
అలాగే ఒక్కరోజు ఎదుకొండలవాడు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం స్వామి వారు సప్త వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించడం ఈ రథసప్తమి వేడుకల ప్రత్యేకత. భక్తులు దీనినే అర్థ సంవత్సర బ్రహ్మొత్సవంగా, ఒక్క రోజు బ్రహ్మొత్సవంగా వ్యవహరిస్తారు.

సూర్యుని పుట్టిన రోజున జరిగే ఈ ఉత్సవంలో తొలుత ఆదివారం(14-02-2016) వేకువజామున మలయప్పస్వామి సూర్య ప్రభ వాహనంపై తిరుమాదావిధులలో ఊరేగుతూ దక్షిణ,ఉత్తర కలిసే మూలైన వాయువ్యదిశ లోకి వేంచేస్తారు. అక్కడ స్వామివార్లు తూర్పు దిశగా నిలబడి సూర్యకిరణాల కోసం వేచిఉంటారు. సూర్యభగవానుడు భక్తీ పారవశ్యంతో తన కిరణాలతో స్వామివారి శరీరాన్ని తాకుతూ పాదాల చెంతకు రాగానే అర్చకులు హారతిచ్చి గోవిందా,గోవిందా,గోవిందా అని నామస్మరణతో ఒక్కరోజు బ్రహ్మొత్సవాల ఊరేగింపు ప్రారంభిస్తారు. ఇది తరతరాలు గా వస్తున్న సంప్రదాయం. అప్పటి నుండి వరుసగా చిన్నశేష,గరుడ,హనుమంత,కల్పవృక్ష,సర్వభూపాల,చంద్ర ప్రభ వాహనాలపై తిరువిదులలో ఉత్సవర్లు ప్రదక్షణ చేస్తారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవ లైన కల్ళ్యాణోత్సవం,ఆర్జిత బ్రహోత్సవం,ఊ0జల్ సేవ,వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు, విఐపి బ్రేకు దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. కాని సుప్రభాతం,తోమాల,అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
Comments
Post a Comment