Skip to main content
వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో formers  ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా చేసుకునే పండుగ- ఏరువాక పున్నమి (9-6-2017). ఏటా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమనాడు సకుటుంబంగా జరుపుకొనే ఈ ఉత్సవాన్ని ‘కృషి పూర్ణిమ’ లేదా ‘హల పూర్ణిమ’ అని వ్యవహరిస్తారు. రైతులు పంటపొలాల్లో, వ్యవసాయ పరికరాల్లో, పశుసంపదలో దైవత్వాన్ని చూసుకొని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఏరు అంటే నాగలి అని, ఏరువాక అంటే దుక్కిదున్నడం ప్రారంభించే రోజు అని అర్థాలున్నాయి.
సువృష్టి ప్రసాదించే ఇంద్రుణ్ని అందరూ ఆరాధిస్తారు. పొలం దున్నడానికి ఉత్తమమైనదిగా ‘జ్యేష్ఠ’ను భావిస్తారు. చంద్రుడు ఆ నక్షత్రంతో కూడి ఉన్నదే జ్యేష్ఠ పూర్ణిమ. ఆయన సకల ఓషధులకు అధిపతి. అవి పుష్కలంగా ఉంటే, వ్యవసాయం విశేషమైన ఫలసాయం అందజేస్తుంది. అందువల్ల అన్నదాతలు క్షేత్రపాలుణ్ని స్తుతిస్తూ మంత్రపఠనం చేసేవారని రుగ్వేదం చెబుతుంది.
ఉత్తర భారతదేశంలో పున్నమి శుభ సందర్భంగా ‘ఉద్వృషభ యజ్ఞం’ పేరిట ఎడ్లను పూజిస్తారు. ఇది జైమిని ‘న్యాయమాల’లో వివరంగా ఉంది. ‘సీత’ అంటే నాగటిచాలు. సీతాయజ్ఞాన్ని ఇదే పండుగనాడు నిర్వహించేవారని ‘విష్ణుపురాణం’ వర్ణిస్తుంది. బౌద్ధ జాతక కథల్లోని పర్వదినమూ ఏరువాక వంటిదే! శుద్ధోదన మహారాజు వర్షరుతువు రాగానే కపిలవస్తు నగరంలోని కర్షకులకు బంగరు నాగళ్లు బహూకరించేవాడని ‘లలిత విస్తరం’ గ్రంథం వివరిస్తోంది. హాలుడి ‘గాథా సప్తశతి’లోనూ ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది.
ఏరు అంటే, ఎడ్లను కట్టి దున్నేందుకు సిద్ధంచేసిన నాగలి. ఏరువాక అంటే, దున్నే ఆరంభ దశ అని నిఘంటువులు చెబుతాయి. అధర్వణ వేదకాలంలో రైతులు దీన్ని ‘అనడుత్సవం’ అని పిలిచేవారు. హలకర్మ పేరుతో నాగలి పూజ చేసేవారు. మేదినీ ఉత్సవం పేరిట భూమిపూజ, వృషభ సౌభాగ్యం అంటూ పశువుల పూజ ఆచరించేవారు. ‘బృహత్సంహిత’లో, పరాశర విరచితమైన ‘కృషి పరాశరం’ గ్రంథంలోనూ ఈ ఉత్సవాల ప్రస్తావనలున్నాయి. దీన్ని కర్ణాటకలో ‘కారిణి పబ్బం’ పేరుతో నిర్వర్తిస్తారు.
పున్నమి పర్వదినాన ‘పద్మపురాణం’ గ్రంథాన్ని దానం చేయడం అశ్వమేధ యాగ ఫలితంతో సమానమని పెద్దలు చెబుతారు. ఇదే రోజున కృష్ణాజినం సైతం దానం చేస్తారు. ఏరువాక పున్నమినాడు మహిళలు భర్త క్షేమం కోసం ‘వటసావిత్రి’ వ్రతం చేస్తారు. వ్యవసాయ పరికరాలతో పాటు పశువుల్ని పూలు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. టెంకాయలు, పండ్లు, పొంగలి నివేదన చేస్తారు. ఎడ్ల బండ్లను, ఎడ్లను కట్టిన నాగళ్లను మంగళవాద్యాలతో వూరేగిస్తారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, కోలాటాలతో సంబరాలు చేసుకుంటారు. ద్వారాలకు గోగునారతో చేసిన తోరణాల్ని కడతారు. వాటిని చర్నాకోలతో కొట్టి, దొరికిన పీచు తీసుకెళ్లి భద్రపరచుకుంటారు.
గ్రామీణ ప్రాంతాల సంస్కృతిని పరిరక్షించడంలో అన్నదాతల పాత్ర ఎనలేనిది. మెతుకు పెట్టి బతుకునిచ్చే రైతుల ఉత్సవమిది. సమాజమంతటికీ ఇది ఉత్సవమే! రైతు క్షేమమే దేశానికి క్షేమం. రైతు సౌఖ్యమే దేశానికీ సౌఖ్యం. కృషీవలుర పారమార్థిక చింత ప్రశంసనీయమైనది. నేలలో విత్తి, నింగి వైపు చూసే రైతు- కంట తడిపెట్టే దశ ఎన్నడూ రాకూడదు. భారతీయ సంస్కృతికి, జాతి జీవన విధానానికి పట్టుకొమ్మలే ‘ఏరువాక’ వంటి పల్లె వేడుకలు

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,