Skip to main content
ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం ||
కుజుడు ఉష్ణ ప్రకృతి గల గ్రహము. దీనిని పాప గ్రహముగా చెప్పబడును. వివాహము మరియు వైవాహిక జీవితములో కుజుని యొక్క అశుభ ప్రభావము అధికముగా కనిపించును.
కుజ దోషము కలవారిని మాంగళీకునిగా చెప్పబడును. ఈ గ్రహ దోషము కారణముగా అనేక మంది స్త్రీ పురుషులు జీవితాంతము అవివాహితులుగా వుండిపోయెదరు. ఈ దోషము వలన గల భయమును తొలగించుటుకొనుటకు దీని గురించి పూర్తిగా తెలుసుకొనుట అవసరము.
ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది. ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు. కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే… స్త్రీల జాతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు. మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు కూడా ఉంటుంది. కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు. శాస్త్రరిత్యా వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంట, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని. కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు(చూపు) ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించాల్సిన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట, సంతాన హీనత , దుర్వెసనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది. వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి, జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం, నమ్మకము, విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ ఉండాలి. భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్న భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించవచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-