Skip to main content

ఏకాదశి వ్రతము

ఏకాదశి వ్రతము అనేది చాలా శ్రేష్టమైన వ్రతము. ఈ వ్రతం ఆచరించుట వలన మనలో ఉత్తమ సంస్కారాలు కలుగుతాయి, కోరిన కోరికలు సిద్ధిస్తాయి, ఆత్మోన్నతి కలుగుతుంది మరియు జన్మాంతరంలో విష్ణులోక ప్రాప్తికి సహకరిస్తుంది.
ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలోను, కృష్ణపక్షంలోను ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశులకి ఒక్కో దానికి, ఒక్కో పేరు ఇవ్వబడినది.
తెలుగు మాసం        శుక్లపక్షం     కృష్ణపక్షం
చైత్ర మాసము           కామద       పాపమోచని
వైశాఖ మాసము        మోహిని      వరూధిని
జ్యేష్ఠ మాసము          నిర్జల          అపర
ఆషాఢ మాసము        శయన        యోగిని
శ్రావణ మాసము         పుత్రద        కామిక
భాద్రపద మాసము       పద్మ          అజ
ఆశ్వేయుజ మాసము   పాపాంకుశ   ఇందిర
కార్తీక మాసము          ప్రబోధిని     రమ
మార్గశిర మాసము      మోక్షద      ఉత్పన్న
పుష్య మాసము         పుత్రద       సఫల
మాఘ మాసము        జయ        షట్ తిల
ఫాల్గుణ మాసము       అమలకి     విజయ
ఈ ఏకాదశి వ్రతమును గృహస్థులందరూ ఆచరించవచ్చును. ముఖ్యముగా వానప్రస్థులు, యతీంద్రులు ఆచరించవలెను. ఈ ఏకాదశీ దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానము. గరుడ పురాణములో “ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి|  కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ ||” అని చెప్పబడినది. అనగా ఉపవాసందానంహరి పూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు. ఆశ్రమ భేదం లేకుండా మానవులందరూ ఏకాదశీ వ్రతాన్ని ఆచరించవలెనని విష్ణుస్మృతి చెప్తున్నది.
ఈ ఉపవాస దీక్షని కేవలం నీరు మాత్రమే స్వీకరిస్తూ కొందరు, మరికొందరు నిర్జలంగా అంటే నీరు కూడా స్వీకరించకుండా పాటిస్తారు. ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ద్వాదశినాడు విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్ధాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనముతో సమానమని శాస్త్రం చెప్తున్నది.
ఒక్కో మాసములో ఏకాదశి తిథి రెండు రోజులు ఉంటుంది. అంటే మొదటిరోజు మధ్యాహ్నమో లేక సాయంత్రమో వచ్చి, మరునాడు మధ్యాహ్నం లేక సాయంత్రం వరకు ఉంటుంది. అటువంటి రోజులలో ఏకాదశి వ్రతం మొదటిరోజు చేయాలా లేక రెండవరోజు చేయాలా అని చాలామందికి ధర్మసందేహం కలుగుతుంది. ధర్మ నిర్ణయ చంద్రిక ప్రకారం వైష్ణవులకు, స్మార్తులకు సూర్యోదయ సమయానికి దశమి వేధ ఉన్నచో అటువంటి ఏకాదశి ఉపవాసానికి పనికిరాదు. ఒకరోజు ఏకాదశి పూర్తిగా ఉండి, మరునాడు సూర్యోదయానికి మిగులు ఉండి, మూడవ రోజున సూర్యోదయానికి ద్వాదశి మిగులు ఉన్నచో, రెండవరోజు నాడే అంటే ఏకాదశి మిగులు ఉన్ననాడే ఉపవాసం ఉండవలెను. మొదటిరోజు ఏకాదశి పూర్తిగా ఉండి, మరునాడు మిగులు ఉండి, మూడవ రోజున ద్వాదశి మిగులు లేని సందర్భములో గృహస్తులు మొదటిరోజున, సన్యాసులు రెండవరోజున ఉపవాసం ఉండవలెనని శాస్త్రం చెప్తున్నది. మరింత సమాచారం కోసం ధర్మసింధుధర్మనిర్ణయచంద్రిక అనే గ్రంథములను పరిశీలించవచ్చు.
ఏకాదశి యొక్క పేరుకు ఉన్న చరిత్ర:
మహావిష్ణువులోని స్త్రీ తేజం ముర అనే రాక్షసిని సంహరించి, దేవతలను రక్షించింది. ఆ తేజానికే విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడు. ఆ ఏకాదశిని పూజించినవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని వరం ఇచ్చాడు. విష్ణుపురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశినాడు ఉపవాసం చేస్తే మిగిలిన 23 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. కానీ, అన్ని ఏకాదశులు ఉపవాసం ఉండాలని భక్తుల నమ్మకం.
విజ్ఞాన శాస్త్రం ప్రకారం భూమి మీద, మానవుల మీద చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏకాదశి నుండి మొదలుపెట్టి తరువాత వచ్చే పంచమి వరకు క్రమంగా చంద్రుని ప్రభావం మన శరీరంలోని రక్తం, మెదడు, జీర్ణ వ్యవస్థల మీద క్రమ క్రమంగా పెరిగి, చివరకు మరలా తగ్గుతుంది. ఏకాదశి నాడు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక ప్రత్యేక అమరికలో ఉండుట వలన ఆరోజు భూమి మీద, ముఖ్యముగా నీటి మీద చంద్రుని ఆకర్షణ తక్కువగా ఉంటుంది. అందువలన నీటి చలనం మందకొడిగా ఉంటుంది. దాని కారణముగా మన ప్రేగులలోని ఆహారం కూడా నెమ్మదిగా కదలి, జీర్ణక్రియ మందగించి, మలబద్ధకానికి దారి తీస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మరునాటికి అంతర చలనం ఒక క్రమపద్ధతికి వచ్చి, శరీరం తేలికపడుతుంది.
అందువలన పురాణాలు, శాస్త్రాలు ప్రకారం ఏకాదశినాడు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆరోగ్యం కలుగుతుంది. ఏకాదశినాడు నీటితో పాటు కొద్దిగా ఉప్పు, ఒక చెంచాడు నిమ్మరసం కలిపి తీసుకోవడం వలన మన జీర్ణవ్యవస్థ నుండి మలినాలు కూడా తొలగింపబడతాయి.
ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదు.
E

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.