భీష్మ ఏకాదశి విశిష్టత- విష్ణు సహస్ర నామ స్తోత్రమును.. ! భీష్ముడు భారతంలో మణిపూస వంటివాడు. ఈతడు సత్యవతీ, శంతనుల వివాహ సంధానకర్తగా, ధృతరాష్ట్ర, పాండురాజులు పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితృతుల్యునిగా, కౌరవుల సర్వసైన్యాధక్షునిగా, సర్వలోకావళికి పాపభంజనం, పుణ్యప్రదం, మోక్షప్రదమునగు ‘శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము’ను అందించిన ఆచార్యునిగా సుప్రసిద్ధుడు. గంగా, శంతనుల కుమారుడైనందున ఇతనికి ‘గాంగేయుడు’, ‘దేవవ్రతుడ’నియు అంటారు. శంతన మహారాజుతో వివాహపూర్వము ఏర్పరచుకొనిన నియమమును రాజు గాంగేయుని జననమున ఉల్లంఘించినందున, ఆ పిల్లవానిని పెంచి పెద్దవానిని చేసి సకల విద్యాపారంగతుని చేసి అప్పగించగలనని పలికి, గంగాదేవి గాంగేయుని తీసికొని శంతనుని విడచి వెళ్ళింది. గంగాదేవి గాంగేయుని పరశురాముని వద్ద సకల విద్యలు, ధనుర్విద్యను నేర్పించి కొంత కాలమునకు శంతన మహారాజుకు అప్పగించింది. సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు. ఇలా ప్రతిజ్ఞ చేసిన కుమారుడు భీష్మునికి శంతనుడు స్వచ్ఛంద మరణ వరమును ప్రసాదించా...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com