కామిక ఏకాదశి మంగళ వారం రోజున (తేది 7-8-2018) తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. తులసీ దళాలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుబాధ, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక తులసీ దళం.. నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణం, వెండి కంటే అతీతమైందని పురాణాలు చెబుతున్నాయి.
అందుచేత కామిక ఏకాదశిన సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ, తులసీ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ రోజున శ్రీ కృష్ణుడిని గాని వెంకటేశ్వరా స్వామిని గాని, రాముల వారిని గాని, నరసింహ స్వామిని గాని, విష్ణు సంబందమయిన దశావతరుముల దేవుడిని నిష్ఠగా పూజించి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపమెలిగిస్తే.. ఆ పరమాత్మ ఆశించిన ఫలితాలనిస్తాడని, పాపాలను హరింపజేసి, స్వర్గలోకవాస ప్రాప్తం ప్రసాదిస్తాడని పండితులు అంటున్నారు. జై శ్రీమన్నారాయణ.
Comments
Post a Comment