వరలక్ష్మీ వ్రతం on 24th August, 31st August and 7th September. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలలో ఏదైనా ఒకవారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి.
ముత్తయిదువులు పిలిచి తాంబూలం,పసుపు బొట్టు ఇవ్వాలి. ఈ పూజ వలన సౌభాగ్యం,సంతోషం, ధన దాన్యములతో వర్ధిల్లుతాము. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు.లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారమంటే చాలాఇష్టం అని శ్రీ సూక్తం తెలియచేస్తోంది.
శుక్ల పక్ష పౌర్ణమి.ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిమరియు రాఖీ పౌర్ణమి అంటారు.ఈ రోజున కొత్త యజ్ఞోపవీతం( జంధ్యం)వేసుకుంటారు, అంతేకాకుండా శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుం టాము.కృష్ణాష్టమిఈమాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.మతత్రయ ఏకాదశి.శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.
Comments
Post a Comment