ఆండాళ్ తిరునక్షత్రం తేది 13-8-2018 సోమవారం నాడు. భార్యగా మారిన పుణ్యవతి ఆండాళ్‌నే గోదాదేవి అని కూడా వ్యవహరిస్తుంటారు. భగవంతుని పేరంతో బంధించవచ్చనే దివ్య సంకేతానికి ఉదాహరణ ఆండాళ్ కథ. హరి సంకీర్తనం, శరణాగతీ, పుష్పమాల సమర్పణం అనే మూడు సేవల గురించి శ్రీమహావిష్ణువు స్వయంగా భూదేవితో చెప్పినట్లు ఆర్యోక్తి.ఆండాళ్ తిరు నక్షత్రం సోమవారం నాడు తేది. 13-8-2018.ఈ రోజున ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై సేవ కాలం మరియు ఆశ్తోతరం, ఆండాళ్ సూక్తి చదువుదాం రండి. శ్రీ వైష్ణవ దేవాలయాలకు రండి. కలిసి పూజలు చేద్దాం.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment