ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని (1-7-2020 బుధవారం) తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచే పండుగల్నీ మొదలవుతాయి మరి ఈ తొలి ఏకాదశి రోజు ఏం చేయాలో, ఈసారి వస్తున్న తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం...
ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలోనూ ఈ రోజు మొదటిదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రోజు ఉపవాసం ఉంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇందుకోసం దశమి రాత్రి నుంచే ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉండాలి. ఇక ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజగదిలో ఉన్న విష్ణుమూర్తిని తులసీదళాలతో పూజించాలి. ఆ రోజు పాలు, పళ్లులాంటి వండని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి.
తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా కూడా పిలుచుకుంటారు. ఈ రోజు నుంచి నాలుగు నెలలపాటు విష్ణుమూర్తి పాలకడలి మీద నిద్రిస్తాడట. అందుకనే ఆ పేరు. అందుకే ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువసేపు ఉంటాయి. చలి కూడా పెరుగుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పు వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈ రోజు పేలాల పిండిని తప్పకుండా తినమని చెబుతారు. పేలాల పిండి వల్ల జలుబులాంటి సమస్యలు దూరమైపోతాయి. పేలాలపిండిని బెల్లం, యాలుకలతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది.
ఆవులను పూజించేందుకు కూడా తొలి ఏకాదశి చాలా మంచిది. గోవు అంటే సాక్షాత్తు కామధేనువు. అందుకే ఈ రోజు కనుక గోపూజ చేస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయని నమ్మకం. రాచకొండ రామాచార్యులు, పూజారి, రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమర్గ్, బేగంపేట్, హైదరాబాద్. మొబైల్ నంబర్ :9989324294
Comments
Post a Comment