పసుపు 25 grams, కుంకుమ 25 గ్రాములు, శ్రీ గంధం , , తమల
పాకులు 11,,బళ్ళారి పోక వక్కలు 11,రూపాయి
బిళ్ళలు 6,కొన్ని పూలు, తులసి
దళాలు, , ఫోటో కి పూల దండ, , దీపం, అరటి
పండ్లు 2, ఆవు
పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం, అగర్బతి, కర్పూరం, బియ్యం
పిండి, ½ కిలో, నల్లని
నువ్వులు, 50 grams, విస్తరి
ఆకులు 4, మోదుగ ఆకు, ఆపు పంచితం, బ్రాహ్మణునికి
బోజనానికి మంచి బియ్యం 3 kg., కూరగాయలు, పప్పులు 1/2 kg., చింతపండు 1/2 kg., ఉప్పు, మిరప
కాయలు, ఆవు నెయ్యి ప్యాకెట్ 1/4 kg.,, నూనె
సీస 1/2 kg., పెరుగు డబ్బా.small బ్రాహ్మణ దక్షిణ 1,116/-
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment