Skip to main content

Posts

Showing posts from September, 2020

అధిక మాసం 18-9-2020 నుండి విశేషం ఏమిటి ?

 ఈ శార్వరి నామ సంవత్సరంలో అధిక మాసం వచ్చింది. అయితే ఈ అధిక మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఈ అధిక మాసం 2020 సంవత్సరంలో సెప్టెంబర్ 18వ తేదీన వచ్చింది. అయితే ఈ సమయంలో దేవుళ్ల పూజలకు సంబంధించిన కార్యక్రమాలను మాత్రం కచ్చితంగా చేయాలంట. ఎందుకంటే శుభకార్యాలు వేరు. దేవతల పూజలు వేరు. ఈ అధిక మాసంలో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. రామాచార్యులు రాచకొండ, పూజారి , శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట్, హైదరాబాద్.  మొబైల్ no.9989324294

మన్యుసుక్త విధానము తో శ్రీ ఆంజనేయ స్వామి వారికీ అభిషేకం, సహస్ర రామ నామ సింధూర నాగవల్లి పత్ర పూజ వివిధ సేవలు

  పసుపు, 200 గ్రాములు, కుంకుం 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, తమల పాకులు 100, jilledi poolu  అరటి పండ్లు, 1 dozen కొబ్బరి కాయ, 1, ఆవు పాలు, 1 లీటర్లు,    పెరుగు  1/2 కిలో, ఆవు నెయ్యి 1/4 కిలో, అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, తేనె  చక్కర  1/4 కిలో, హనుమంతునికి చిందూరం 1/2 కిలొ.  నువ్వుల నూనె 1/2 litre, పన్ని ఒక పాకెట్.  పూజ దక్షిణ  లడ్డు ప్రసాదం కిలో 

On Birth day prasaadam

  సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు చెప్తున్నారు. పుట్టిన రోజునాడు ఆవు పాలు , బెల్లము , నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది. సప్త చిరంజీవి శ్లోకం : అశ్వత్థామ , బలిర్వర్యాసో , హనుమాంశ్చ విభీషణ ! కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవనః !! సప్తైతాన్ సంస్మరేన్నిత్యమ్ మార్కండేయ యథాష్టమమ్! జీవేద్వర్శశతమ్ ప్రాజ్ఞః అపమృత్యు వివర్జితః !!   చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండేవారని అర్థం. కానీ అంతం లేని వారని కాదు. శాశ్వత కీర్తి కలిగిన వారే చిరంజీవులు. అశ్వత్థామా , బలిచక్రవర్తి , వ్యాసుడూ , హనుమంతుడు , విభీషణుడు , కృపాచార్యుడు , పరుశురాముడు.. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ , బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా వందేళ్ళు జీవిస్తారు

పుణ్యః వాచనం అంటే ఏమిటి ?

  1. పుణ్యాహవాచనం . సమస్త శుభకార్యాలకు ముందు చేయవలసిన వైదిక ప్రక్రియ "పుణ్యాహవాచనం, దేవతా సంబంధమైన ఉత్సవాల్లోకూడ దీన్ని విధిగా ఆచరిస్తారు. మనుష్య కర్మలకు చేసే పుణ్యాహ వాచనాన్ని 'కర్మణః పుణ్యాహ' మనీ, దేవతా ఉత్సవాల్లో చేసేదాన్ని దేవ పుణ్యాహమనీ అంటారు. గృహాల్లో పుణ్యాహ వాచనం చేసే సమయంలో పురోహితుడు వేదమంత్రాలను పఠిస్తూ ఇంటియజమాని, అతని కుటుంబంసుఖసంతోషాలతో సమృద్ధిగా వండాలని ఆశీర్వదిస్తాడు. అలాగే, ఆ ఇంట్లో అన్ని దిక్కుల్లో అంతటా పవిత్రత వుండాలని దేవతల్ని ప్రార్ధిస్తాడు. ఆ తరువాత పూర్ణకుంభంలో వున్న మంత్రపూత జలాన్ని కుటుంబ సభ్యులపైన, అప్పడక్కడ వున్న అందరిపైన ఇల్లంతా ప్రోక్షించి, 'తుష్టి రస్తు, పుష్టి రస్తు అంటూ ఆశీర్వదిస్తారు. ఇలా పుణ్యాహ వాచనం చేసేముందు, తాము చేసే కార్యం నిర్విఘ్నంగా జరగాలని విష్వక్సేనుని- వినాయకుని పూజిస్తారు.

ఉదకశాంతి అంటే ఏమిటి ?

  2. "ఉదకశాంతి' ఉదక శాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ. మంత్రజలంతో కాబట్టి దీన్ని "ఉదకశాంతి' అంటారు. దీన్ని ఉపనయనం, వివాహం, స్నాతకం మన్నగు సంస్కారాల్లోను, షష్టిపూర్తి, సహస్రచంద్ర దర్శనోత్సవం, ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునే వారు ఆచరించాలని బోధాయన మహర్షి పేర్కొన్నారు. నాలుగు దిక్కుల్లోను, ఉదక శాంతి జపం చేయడానికి నలుగురు స్వాములను ఆహ్వానించి, పురోహితుడు శుచిగా వుంచిన స్థలంలో స్థండిలాన్ని ఏర్పాటు చేస్తాడు. స్థండిలం అంటే పూర్ణకుంభం వుంచడానికి నూతన వస్త్రంపై వడ్లు, నూవులు,గోధుమలు  బియ్యం పోసి ఏర్పాటు చేసే వేదిక. ముందు విష్వక్సేన-వినాయక పూజ, పుణ్యాహవాచనం చేసి, ఆ తరువాత, స్థండిలంపై పూర్ణకలశాన్ని ప్రతిష్టించి, నాలుగు వేదాలలోని వివిధ మంత్రాలు, ప్రక్రియలతో ఉదకశాంతిని ఇల్లు అంతా చల్లి సాంబ్రాణి ఊదుతో పూర్తిచేసి, ఆ మంత్రజలాన్ని తీర్థంగా ఇచ్చి, అందరిపైనా ప్రోక్షించి ఆశీర్వదిస్తారు.రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్యులు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట, హైదరాబాద్. phone no.9989324294