1. పుణ్యాహవాచనం . సమస్త శుభకార్యాలకు ముందు చేయవలసిన వైదిక ప్రక్రియ "పుణ్యాహవాచనం, దేవతా సంబంధమైన ఉత్సవాల్లోకూడ దీన్ని విధిగా ఆచరిస్తారు. మనుష్య కర్మలకు చేసే పుణ్యాహ వాచనాన్ని 'కర్మణః పుణ్యాహ' మనీ, దేవతా ఉత్సవాల్లో చేసేదాన్ని దేవ పుణ్యాహమనీ అంటారు. గృహాల్లో పుణ్యాహ వాచనం చేసే సమయంలో పురోహితుడు వేదమంత్రాలను పఠిస్తూ ఇంటియజమాని, అతని కుటుంబంసుఖసంతోషాలతో సమృద్ధిగా వండాలని ఆశీర్వదిస్తాడు. అలాగే, ఆ ఇంట్లో అన్ని దిక్కుల్లో అంతటా పవిత్రత వుండాలని దేవతల్ని ప్రార్ధిస్తాడు. ఆ తరువాత పూర్ణకుంభంలో వున్న మంత్రపూత జలాన్ని కుటుంబ సభ్యులపైన, అప్పడక్కడ వున్న అందరిపైన ఇల్లంతా ప్రోక్షించి, 'తుష్టి రస్తు, పుష్టి రస్తు అంటూ ఆశీర్వదిస్తారు. ఇలా పుణ్యాహ వాచనం చేసేముందు, తాము చేసే కార్యం నిర్విఘ్నంగా జరగాలని విష్వక్సేనుని- వినాయకుని పూజిస్తారు.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment