2. "ఉదకశాంతి' ఉదక శాంతి అనేది వేదమంత్రాలతో ఆచరించే ఒక ప్రక్రియ. మంత్రజలంతో కాబట్టి దీన్ని "ఉదకశాంతి' అంటారు. దీన్ని ఉపనయనం, వివాహం, స్నాతకం మన్నగు సంస్కారాల్లోను, షష్టిపూర్తి, సహస్రచంద్ర దర్శనోత్సవం, ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరుకునే వారు ఆచరించాలని బోధాయన మహర్షి పేర్కొన్నారు. నాలుగు దిక్కుల్లోను, ఉదక శాంతి జపం చేయడానికి నలుగురు స్వాములను ఆహ్వానించి, పురోహితుడు శుచిగా వుంచిన స్థలంలో స్థండిలాన్ని ఏర్పాటు చేస్తాడు. స్థండిలం అంటే పూర్ణకుంభం వుంచడానికి నూతన వస్త్రంపై వడ్లు, నూవులు,గోధుమలు బియ్యం పోసి ఏర్పాటు చేసే వేదిక. ముందు విష్వక్సేన-వినాయక పూజ, పుణ్యాహవాచనం చేసి, ఆ తరువాత, స్థండిలంపై పూర్ణకలశాన్ని ప్రతిష్టించి, నాలుగు వేదాలలోని వివిధ మంత్రాలు, ప్రక్రియలతో ఉదకశాంతిని ఇల్లు అంతా చల్లి సాంబ్రాణి ఊదుతో పూర్తిచేసి, ఆ మంత్రజలాన్ని తీర్థంగా ఇచ్చి, అందరిపైనా ప్రోక్షించి ఆశీర్వదిస్తారు.రాచకొండ రామాచార్యులు, పూజారి, జ్యోతిష్యులు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయురిమార్గ్,బేగంపేట, హైదరాబాద్. phone no.9989324294
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment