చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల జ్యేష్ఠము. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. ఈ మాసంలో ఏం చేయాలి..? జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com