వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. అందులోనూ ఆయనకు ప్రతిరూపమైన మోహినీదేవి అవతరించిన సందర్భం. కాబట్టి ఈ 12-5-2022 మోహినీ ఏకాదశి. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. మన రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఆత్మక్షోభ వరకు సకల బాధలకూ ఈరోజు చేసే ఏకాదశి వ్రతం ఉపశమనం కలిగించి తీరుతుంది.
మోహినీ ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంతే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి, మర్నాడు… అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారమూ తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు. ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులను బట్టి, అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు, పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు. ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ నిద్రించరాని శాస్త్రం.
ఈ రోజు అభ్యంగన స్నానం చేయాలనీ, విష్ణుమూర్తిని ధూపదీపనైవేద్యాలతో పూజించాలనీ, ఉపవాసంతో రోజును గడపాలనీ, దానధర్మాలు చేయాలని పెద్దలు చెబుతారు. ఇవన్నీ కుదరకపోయినా… కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి. తన మోహిని అవతారంతో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారాడో… అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి.
Comments
Post a Comment