Skip to main content

Posts

Showing posts from June, 2022

చిత్త నక్షత్ర దోష శాంతి పూజ సామగ్రి

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 20 గ్రాములు, రాగి చెంబులు 2 , దోవతులు , ఉత్తరీయములు 2 , చీరలు 2,  బియ్యం 3 కిలోలు, గోధుమ పిండి 1500 గ్రాములు, కంది పప్పు 1500 గ్రాములు, పెసర పప్పు 1500 గ్రాములు, పుట్నాల పప్పు 1500 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినపప్పు 1500 గ్రాములు, ఉలవలు 1500 గ్రాములు, తమల పాకులు 100  నల్లని పోక వక్కలు 50  ఖర్జూరం పండ్ల పాకెట్ 1, అరటి పండ్లు డజన్,  పూలు 1 కిలో, కొబ్బరి కాయలు 13,, ఆగరబతీలు, 1 పాకెట్, కర్పూరం 1 పాకెట్ ఆవు పంచితం,  శివ లింగం 1, ఆవుపాలు, పెరుగు, తేనె , చక్కెర, పండ్ల రసాలు,(పంచాంమృతం)  విభూది 1, నువ్వుల నూనె 1/2 కిలో, కంచు ముకుడు చిన్నది 1, దీపం వత్తులు , అగ్గిపెట్టె, దీపాలు 2,  2 పూజార్ల దక్షిణ 12, 000/-

ఆషాడ మాసం ఆరంభం

    ఆషాఢ మాసం  జూన్ 30 వ తేదీ గురువారం  నుండి ప్రారంభమవుతుంది.  ఈ మాసంలో రెండు ఏకాదశులు ఉన్నాయి, ఇందులో శుక్ల పక్షంలోని దేవశయని ఏకాదశి ప్రత్యేకం. ఈ ఏకాదశి నుండి శ్రీమహావిష్ణువు (Lord vishnu) యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ మాసంలో (Ashadha Masam) విష్ణుమూర్తిని పూజించడం చాలా ముఖ్యం. ఆయన ఆశీస్సులతో కోరికలు నెరవేరుతాయి.  ఆషాఢ మాసం యొక్క మతపరమైన ప్రాముఖ్యత 1. ఆషాఢమాసంలో జగత్తును పోషించే శ్రీ హరివిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. 2. ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి . దీనినే యోగినీ ఏకాదశి అంటారు. 3. ఆషాఢమాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి దేవతలందరూ నిద్ర యోగంలో ఉన్నారు. దీని కారణంగా అన్ని శుభకార్యాలు ఆగిపోతాయి. 4. దేవశయని ఏకాదశి నుండే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. మహావిష్ణువు యోగ నిద్రలో ఉండడం వల్ల పెళ్లి, క్షవరం, గృహ ప్రవేశం, నిశ్చితార్థం తదితర కార్యక్రమాలు నాలుగు నెలల పాటు బంద్‌లో ఉంటాయి. 5. విష్ణువు యోగ నిద్రలోకి వెళితే.. ఆ బాధ్యతను శివుడు తీసుకుంటాడు.  6. ఆషాఢమాసం కోరిన కోర్కెలు తీరుతుందని చెబుతారు. మీరు దేవుని నుండ...

సంస్కృతం లో నీతి వాఖ్యాలు

  ధర్మ ఏవో హతో హంతి "ధర్మో రక్షతి రక్షిత:" తస్మా ధర్మో న హంతవ్యో మానో ధర్మో హ్రతోవ్రధీత్ 🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా ! 🔥 సత్యమేవ జయతే నా2నృతం సత్యేన పంథా వితతో దేవయాన: యేనా క్రమం తృషయో హా్యప్త కామా యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్ 🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు. 🔥 అహింసా పరమో ధర్మ: తథా2 హింసా పరం తప: అహింసా పరమం ఙ్ఞానం అహింసా పరమార్జనమ్ 🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన 🔥 ధనమార్జాయ కాకుత్స్థ ! ధన మూల మిదం జగత్ అంతరం నాభి జానామి నిర్ధనస్య మృతస్య చ 🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం. 🔥 అపి స్వర్ణ మయీ లంకా న మే రోచతి లక్ష్మణ ! జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి. 🔥సో...

సంకష్ట హర చతుర్థి తేదీ 17-6-2022 శుక్రవారం

  గణేశుని అనుగ్రహం పొందడానికి సంకష్టి చతుర్థి ఉత్తమమైన రోజు. రేపు అంటే జూన్ 17న సంకష్ట చతుర్థి వ్రతాన్ని (Sankashti Chaturthi June 2022) ఆచరిస్తారు.     ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సర్వార్థ సిద్ధి యోగం కూడా ఈ రోజే ఏర్పడుతోంది. ఈ యోగంలో చేసే పూజలు మరియు శుభ కార్యాలు అనేక ఫలాలను ఇస్తాయి. గణేశుడు సంతోషించి...మీకు విజయాన్ని మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.   సంకష్టహర  చతుర్థి  నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు  విశేషాలు . వినాయకుడి పూజా విధానం.ఈ   రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి.. ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి. సంకష్ట హర చతుర్థి రోజున గరిక పూజ:- విఘ్నేశ్వర స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టం.   లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడి అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారు.  ఇంకా వినాయకుడికి ప్రీతి...

జ్యేష్ట మాసం శుద్ధ ద్వాదశి విశేషం తేదీ 11-6-2022 శనివారం

  జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్| తథా చోక్తం వరాహపురాణే- జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః| అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥ స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ| అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥ దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ ఇతి| తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్| ★జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి , పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది. ★ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. ఉత్కళ రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అను పేరిట , జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి. జ్యేష్ఠ శుద్ద ద్వాదశి ని కూడా దశహరా ద్వాదశి అని కూడా అంటారు. దుర్ద...

నిర్జల ఏకాదశి తేదీ 10-6-2022 శుక్రవారం

  పేరుకు  తగిన విధంగా ఈ నిర్జల ఏకాదశి ఉపవాసంలో నీటిని త్యాగం చేస్తారు. నిర్జల అంటే నీటితో చేసినది. ఈ రోజు ఉపవాసం పాటించేవారు నీరు తీసుకోరు. అందుకే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు , పాయసం , పానకం , నెయ్యి , గొడుగు దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది.  నిర్జల ఏకాదశి  వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ఉపవాసం కష్టతరమైన ఉపవాసాలలో ఒకటి. ఈ వ్రతాన్ని పాటించడం వల్ల మానవులకు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఈ వ్రతం విశేషమైన పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలలో చెప్పబడింది.  నిర్జల ఏకాదశి వ్రతంలో ఏ పనులు చేయకూడదు? మాంసాహారం, మద్యం, తామసిక ఆహార పదార్థాలు తీసుకోవద్దు. నిర్జల ఏకాదశి వ్రతంలో నీరు కూడా తాగడం నిషిద్ధం. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించకండి, ఎందుకంటే ఇది చాలా కష్టమైన ఉపవాసం. నిర్జల ఏకాదశి రోజున ఎవరి పట్ల ద్వేషం, కోపాన్ని మనసులో ఉంచుకోకండి. ఉపవాసం రోజున దురాశ వంటి చెడు అలవాట్లకు దూర...

జ్యేష్ట మాసం లో అభిషేకం

  ఈ జ్యేష్ట మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయును.ఈ మాసంలో తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారికి మరియు అనేక శ్రీ వైష్ణవ దేవాలయాలలో కలశ ములతో  జ్యేష్టాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక  సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్ధం ఇవి నిర్వహిస్తారు. పురుషోత్తమ క్షేత్రము అయిన 'పూరీ' లో కుడా సుభద్ర సహిత జగన్నాధ, జలభద్రుల మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు.     हिंदू धर्म में ज्येष्ठ माह का बहुत ही महत्वपूर्ण स्थान रखता है. कहा जाता है कि यह महीना ब्रह्मा जी को अति प्रिय है. यह माह सूर्य उपासना और रविवार व्रत रखकर भगवान सूर्य को प्रसन्न करने का सबसे उत्तम है. पेड़-पौधों और जीवों को जल देने से पुण्य प्राप्त होता है.   ज्येष्ठ माह में एकदंत संकष्टी चतुर्थी, अपरा एकादशी, मासिक शिवरात्रि, सोमवती अमावस्या, शनि जयंती, वट सावित्री व्रत, गंगा दशहरा, निर्जला एकादशी जैसेअन्य कई महत्वपूर्ण व्रत एवं त्योहार होंगे.

మొదటి సంవశ్చర0 వర్ధంతి పూజ సామగ్రి

      //శ్రీ రామ // నల్లని నువ్వులు, 50 గ్రాములు, దర్భ కట్ట,  బియ్యం 2 కిలోలు,  తమల పాకులు, 25, వక్కలు 25, ఖర్జూరం 11, వి డి పూలు, ఫోటో కు దండ 1, మామిడి ఆకులు , ప్లాస్టిక్ గ్లాసులు 3 ,  ఆవు పేడ కొంచెం, ఆవు పంచితం కొంచెం,  విస్తరి ఆకులు, 10, బియ్యం  పిండి 400 గ్రాములు, ఆవు పాలు, 100 ml ,పెరుగు,100 గ్రాములు, తేనె 100 గ్రాములు, ఆవు నెయ్యి 50 గ్రాములు,బెల్లం పొడి  అరటి పండ్లు, 1/2 డజన్, ప్లాస్టిక్ దొ ప్పలు 6  రాగి చెంబులు 6 , రాగి గ్లాసులు 6 , రూపాయి నాణెములు, 21   బియ్యం  3  పాక్కెట్లు, ఒక్కొక్కటి కిలో , మూడు రకముల కూరగాయలు, దుంపలు,ఆకు కూరలు, 3  పాక్కెట్లు,  చింతపండు 3  పాక్కెట్లు, కంది  పప్పు 3  పాక్కెట్లు, ఆవు నెయ్యి పాక్కెట్లు, 3 పెరుగు 3  పాక్కెట్లు ,ఎండు మిరపకాయలు 3  పాక్కెట్లు,  దోవతి, సెల్లాలు, 3  సెట్లు ,  బ్రాహ్మణ దక్షిణ అన్నీ  కలిపి 5,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.