గణేశుని అనుగ్రహం పొందడానికి సంకష్టి చతుర్థి ఉత్తమమైన రోజు. రేపు అంటే జూన్ 17న సంకష్ట చతుర్థి వ్రతాన్ని (Sankashti Chaturthi June 2022) ఆచరిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సర్వార్థ సిద్ధి యోగం కూడా ఈ రోజే ఏర్పడుతోంది. ఈ యోగంలో చేసే పూజలు మరియు శుభ కార్యాలు అనేక ఫలాలను ఇస్తాయి. గణేశుడు సంతోషించి...మీకు విజయాన్ని మరియు ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. సంకష్టహర చతుర్థి నాడు ప్రత్యేకంగా ఏమీ పాటించరు కానీ ఉపవాసముండి, సాయంకాలం చంద్రదర్శనం చేసిన తర్వాత భోజనం చేస్తారు. వినాయకుడిని పూజించడం రాత్రి నెలవంక చూడటం ఈ రోజు విశేషాలు. వినాయకుడి పూజా విధానం.ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి.. ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి.సంకష్ట హర చతుర్థి రోజున గరిక పూజ:- విఘ్నేశ్వర స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టం. లేతగా ఉండే గరికపోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడి అష్టోత్తర నామాలు చెబుతూ నివేదిస్తారు. ఇంకా వినాయకుడికి ప్రీతిగా ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని పూలు, ధూపం, దీపం నైవేద్యంగా సమర్పిస్తారు. మందార పువ్వులు వినాయకుడికి అర్చనలో విశేషంగా సమర్పిస్తారు. ఆయనను నిష్టతో పూజించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. గణపతి విగ్రహాన్ని పూలతో అలంకరించి.. నువ్వులు, బెల్లం, లడ్డూలు, పువ్వులు, నీరు, ధూపం, గంధం, అరటి లేదా కొబ్బరికాయతో పూజించాలి. సంకట హర చతుర్థి రోజున గణపతికి నువ్వుల మోదకాలు సమర్పించాలి. తప్పక గోమాత ప్రదక్షిణ, ఎదో ఒక గణపతి దేవాలయ దర్శనం చేయాలి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment