జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం
ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్| తథా చోక్తం వరాహపురాణే-
జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః|
అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥
స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ|
అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥
దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ ఇతి|
తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్|
★జ్యేష్ఠశుద్ధ ఏకాదశినాడు బంగారముతో రామలక్ష్మణ విగ్రహములను తయారుచేయించి , పూజించి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణులకు దానముచేయవలెనని వరాహపురాణము చెప్పుచున్నది. కనుకనే ఆ ద్వాదశికి రామలక్ష్మణ ద్వాదశి అని పేరుగల్గినది.
★ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. ఉత్కళ రాష్ట్రము మొదలైన కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా చంపక ద్వాదశి అను పేరిట , జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి.
జ్యేష్ఠ శుద్ద ద్వాదశి ని కూడా దశహరా ద్వాదశి అని కూడా అంటారు. దుర్దశలను పోగొట్టగలిగే శక్తి గల తిథి ఇది. ఈరోజు నది స్నానాలుచేయడం, నదీ స్నానానికి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయం లో గంగా, గంగా, గంగా అని ని స్మరించడం ఉత్తమం గా పండితులు పేర్కొంటున్నారు.
Comments
Post a Comment