వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ll
హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణమని 'గురు పూర్ణమి' లేదా 'వ్యాస పూర్ణిమ' అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కింది.ఇలా గురు భగవానుడిని స్మరించుకుని, గురు పూర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు.
శ్రీమత్భాగవతం భగవానుని 21 అవతారాలని తెలుపుతూ,వేదవ్యాసుని 17 వ అవతారంగా చెబుతుంది.
వ్యాసుడు నల్లగా ఉండేవాడంట... అందుకని ఈయనను కృష్ణుడు అని అన్నారు. క్రిష్ణుడు అని అనేవారు. ఈయన నివాసము స్థానము హిమాలయములలో, సరస్వతి నది మధ్య గల ఒక ద్వీపం... కనుక కృష్ణ ద్వైపాయనుడు అని అంటారు .
ఈ ఏడాది గురు పౌర్ణమి 13 జూలై 2022 బుధవారం జరుపుకుంటున్నారు. ఈ రోజునే 4 రాజయోగాలు కూడా ఏర్పడటం వల్ల గురు పూర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. ఈ పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు ఎలాంటి సమస్య నుండైనా బయటపడతారు. పురాణాల ప్రకారం ఆ వ్యాసుడి అనుగ్రహంతో పూర్వం వేదనిధి, వేదవతికి సంతానయోగం లభించింది. దీంతో వారు అప్పటి నుండి సుఖసంతోషాలతో పాటు వారి జీవిత చరమ అంకంలో విష్ణు సాయుజ్యాన్ని పొందగలిగారు. అందుకే గురు పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండిస్తున్నారు.
ఈ పరిహారాలు చేయండి
>> గురు పూర్ణిమ రోజున లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను కొట్టండి. ఈ రోజున విష్ణువును పూజించి.. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలగిపోయి అదృష్టం కలిసివస్తుంది.
>> మీకు డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే.. గురు పూర్ణిమ నాడు అవసరమైన వారికి శనగ పప్పును దానం చేయండి.
>> మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి. దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.
>> చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది. గురు పూర్ణిమ రోజున గురువును పూజించి...ఆయన ఆశీర్వాదం తీసుకోండి. వారికి పసుపు బట్టలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీ తలుపు తడుతుంది.
Comments
Post a Comment