ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. దీని గురించి పద్మ పురాణంలో వివరించబడింది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల అశ్వమేథ యాగం చేసిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. మరోవైపు ఈసారి వచ్చిన అజ ఏకాదశి వేళ అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రత్యేకమైన రోజున పునర్వసు, పుష్య నక్షత్రాల ప్రభావంతో వరియాన్ యాగం, రవి పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడనున్నాయి. మూడు శుభ యోగాలు..
ఈ పవిత్రమైన రోజున సర్వార్ధ, వరియాన్, రవి పుష్య యోగాలు ఏర్పడనున్నాయి. ఈ మూడు యోగాల వల్ల అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ మూడు యోగాల సమయంలో శ్రీ హరిని ఆరాధించడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment