Skip to main content

భగవంతుని ఉపచారములు - రకములు

 భగవంతుడిని పూజించే విశేష ఘట్టములను ఉపచారములు అని అందురు. వీనిలో సంక్షేపం, విస్తారం అని రెండు రకములు కలవు.ఈ విషయాలు వివిధ ఆగమ శాస్త్రాలలో తెలిపినారు. 

లఘువుగా జరుపబడు ఉపచారములను సంక్షేప ఉపచారములని, విశేష రీతిలో జరుపబడు ఉపచారములను విస్తార ఉపచారములని అంటారు. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, మప్ఫైఆరు, అరవైనాలుగు అని అనేక విధాలుగా ఉపచారములు ఉన్నాయి.

పంచోపచారాలు– 1. గంధం 2. పుష్పం 3. ధూపం 4. దీపం 5. నైవేద్యం

దశోపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. గంధం 7. పుష్పం 8. ధూపం 9. దీపం 10. నైవేద్యం

షోడశోపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆచమనం 4. స్నానం 5. వస్త్రనివేదనం 6. ఆభూషణం 7. గంధం 8. పుష్పం 9. ధూపం 10. దీపం 11. నైవేద్యం 12. ఆచమనం 13. తాంబూలం 14. స్తవపాఠం 15. తర్పణం 16. నమస్కారం

అష్టాదశోపచారాలు– 1. ఆసనం 2. స్వాగతం 3. పాద్యం 4. అర్ఘ్యం 5. ఆచమనీయం 6. స్నానీయం 7. వస్త్రం 8. యజ్ఞోపవీతం 9. భూషణం 10. గంధం 11. పుష్పం 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాల్యం 17. అనులేపనం 18. నమస్కారం

ముప్ఫైఆరు ఉపచారాలు– 1. ఆసనం 2. అభ్యంజనం 3. ఉద్వర్తనం 4. నిరుక్షణం 5. సమ్మార్జనం 6. సర్పిఃస్నపనం 7. ఆవాహనం 8. పాద్యం 9. అర్ఘఅయం 10. ఆచమనం 11. స్నానం 12. మధుపర్కం 13. పునరాచమనం 14. యజ్ఞోపవీతం, వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పుష్పం 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 21. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శయ్యా 25. చామరం 26. వ్యంజనం 27. ఆదర్శం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్తనం 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణం 35. దంతకాష్ఠం 36. విసర్జనం

అరవైనాలుగు ఉపచారాలు– 1. పాద్యం 2. అర్ఘ్యం 3. ఆసనం 4. తైలాభ్యంగం 5. మజ్జనశాలాప్రవేశః 6. పీఠోపవేశనం 7. దివ్యస్నానీయం 8. ఉద్వర్తనం 9. ఉష్ణోదకస్నానం 10. తీర్థాభిషేకం 11. ధౌతవస్త్రపరిమార్జనం 12. అరుణదుకూలధారణ 13. అరుణోత్తరీయధారణ 14. ఆలేపమండపప్రవేశం 15. పీఠోపవేశనం 16. చందనాది దివ్యగంధానులేపనం 17. నానావిధపుష్పార్పణం 18. భూషణమండపప్రవేశం 19. భూషణమణిపీఠోపవేశనం 20. నవరత్నముకుటధారణం 21. చంద్రశకలం 22. సీమంతసిందూరం 23. తిలకరత్నం 24. కాలాంజనం 25. కర్ణపాలీ 26. నాసాభరణం 27. అధరయావకం 28. గ్రథనభూషణం 29. కనకచిత్రపదకం 30. మహాపదకం 31. ముక్తావళి 32. ఏకావళి 33. దేవచ్ఛదకం 34. కేయూరచతుష్టయం 35. వలయావళి 36. ఊర్మికావళి 37. కాంచీదాసకటిసూత్రం 38. శోభాఖ్యాభరణం 39. పాదకటకం 40. రత్ననూపురం 41. పాదాంగుళీయకం, హస్తాంగుళీయకం 42. అంకుశం 43. పాశం 44. పుండ్రేక్షుచాపం 45. పుష్పబాణధారణం 46. మాణిక్యపాదుక 47. సింహాసనారోహణం 48. పర్యంకోపవేశనం 49. అమృతాసవసేవనం 50. ఆచమనీయం 51. కర్పూరవటికా 52. ఆనందోల్లాసవిలాసహాసం 53. మంగళార్తికం 54. శ్వేతచ్ఛత్ర 55. చామరద్వయం 56. దర్పణం 57. తాలవృంతం 58. గంధం 59. పుష్పం 60. ధూపం 61. దీపం 62. నైవేద్యం 63. ఆచమనం 64. పునరాచమనం (తాంబూలం, వందనం)

రాజోపచారాలు- షోడశోపచారాలు కాక ఛత్రంచామరంపాదుకాదర్పణం అను ఉపచారములు కూడా కలవు.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,