యంత్రము అనగా నియమ నిష్టలతో నియంత్రించేది అని అర్థం. దేవతలకు నివాసయోగ్యమైన గృహము అని అర్థము. ఈ యంత్రమునే దేవతా నగరం, దేవత వాస స్థానం అని కూడా అంటూ ఉంటారు. యంత్రములో కొలువైయున్న సమస్త దేవతామూర్తులు సకల దోషములను నివృత్తి చేసి మానవజాతికి శుభములు చేకూరుస్తాయి. కాబట్టి యంత్రములను సిద్ధిచేసి, పరిపూర్ణమైన పంచొపచార పూజ , ప్రక్రియలు, అమ్మవారికి కుంకుమ పూజ చేయండి!...అన్నీ శ్రద్ధగా చేసి స్థాపన చేసినట్లైతే యంత్రము యొక్క పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు. కాకపోతే ఆ యంత్రమునకు మనము నిర్వర్తించే పూజ ప్రక్రియలపై వాటి ఫలితము ఆధారపడి ఉంటుంది.మహర్నవమి నాడు అమ్మవారిని ''అపరాజిత''గా పూజిస్తారు. మహిషాసురమర్దినిగా అలంకరించి ఆరాధిస్తారు. కొందరు నవరాత్రుల్లో తొమ్మిదవ రోజయిన ఈ మహర్నవమి పర్వదినాన ముక్తేశ్వరీ దేవిని అర్చిస్తారు. దశ మహావిద్య పూజ, సప్తమాత్రిక, అష్టమాత్రిక పూజలు నిర్వహిస్తారు. నవదుర్గ శాక్తేయ సాంప్రదాయులు సిద్ధిధాత్రీ పూజ చేస్తారు. యంత్రము, మంత్రము, తంత్రము ఇవన్నీ కలిస్తేనే పూజా అని అంటారు. ఔషధ ప్రయోగముకు, రాజ్యపాలనముకు, దేవాలయ నిర్మాణముకు, దేవాలయ ఉత్సవాలకు, దేవాలయ నిత్య ఆరాధనలు, దేవాలయ ఆగమ శాస్త్రములు, వామచారము ఇవన్నిటిని తంత్రములు అని పిలుస్తారు. యంత్రములోని మధ్యభాగములో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుంది అని తంత్ర శాస్త్రములోని నమ్మకము. ఒక్కొ యంత్రము ఆ యా దేవతామూర్థులకు సంబంధించి నిర్ధిష్టమైన రేఖా చిత్రాల రూపములో చెక్కబడి ఉంటుంది. తంత్ర శాస్త్రములో శక్తికి, శక్తి యొక్క ప్రతిరూపాలకి ఈ యంత్రమును ఉపయోగిస్తారు. ఎంతో శక్తివంతమైన యంత్రములు వాటికి సంబంధించిన బీజమంత్రములతో ధ్యానము గావించి , నిర్ధిష్టమైన రోజుల పాటు, నిర్ధిష్టమైన సంఖ్య సార్లు జపించి సిద్ధి పొంది ఆ యంత్రము నుండి పరిపూర్ణ ఫలితములు పొందవచ్చు.దసరా నవరాత్రులలో భాగంగా యంత్రాల పూజలను మహా నవమి రోజున 11-10-2024 Friday నాడు నిర్వహిస్తారు.
కాబట్టి యంత్రాలను, పనిముట్టులను, వృత్తి సామగ్రి ని స్వస్చత గా ఉంచి పూజించాలి.
ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము , 2.సంగవకాలము , 3. మధ్యాహ్నకాలము , 4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. · ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా , వ్రత , శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. · ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. · ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...
Comments
Post a Comment