Skip to main content

Posts

Showing posts from June, 2024

యోగిని ఏకాదశి తేదీ 2-7-2024 మంగళవారం

 యోగిని  ఏకాదశిని.  ఇది హిందూ మతం ప్రధాన ఏకాదశిలో ఒకటి. ఈ ఉపవాసంలో విష్ణువును పూజిస్తారు.యోగిని   ఏకాదశి రోజు కుదిరిన వారు గంగా స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి. అనంతరం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ  తులసి దళాలతో అర్చించాలి. విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. చామంతులు, మల్లెలతో అర్చన చేయాలి. తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ మొదలైనవి అర్పించాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. యోగిని ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఏకాదశి ఉపవాసంలో నిషిద్ధం.ద్వాదశి రోజున  సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు. మద్యపానం నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి. 

జ్యేష్ట మాసం అభిషేకాలు

    ఈ జ్యేష్ట మాసమంతా జలదానం చేయడం పుణ్యలోక ప్రాప్తిని కలుగజేయును.ఈ మాసంలో తిరుమలలో వేంకటేశ్వరస్వామి వారికి మరియు అనేక శ్రీ వైష్ణవ దేవాలయాలలో కలశ ములతో  జ్యేష్టాభిషేకములు నిర్వహిస్తారు. జగమంతా శాంతిగా ఉండడానికే కాక  సంవత్సర కాలంలో ఏమైనా లోపాలు జరిగి ఉంటే వాటి పరిహారార్ధం ఇవి నిర్వహిస్తారు. పురుషోత్తమ క్షేత్రము అయిన 'పూరీ' లో కుడా సుభద్ర సహిత జగన్నాధ, జలభద్రుల మూలవిరాట్టుకు అభిషేకం నిర్వహిస్తారు.     हिंदू धर्म में ज्येष्ठ माह का बहुत ही महत्वपूर्ण स्थान रखता है. कहा जाता है कि यह महीना ब्रह्मा जी को अति प्रिय है. यह माह सूर्य उपासना और रविवार व्रत रखकर भगवान सूर्य को प्रसन्न करने का सबसे उत्तम है. पेड़-पौधों और जीवों को जल देने से पुण्य प्राप्त होता है.   ज्येष्ठ माह में एकदंत संकष्टी चतुर्थी, अपरा एकादशी, मासिक शिवरात्रि, सोमवती अमावस्या, शनि जयंती, वट सावित्री व्रत, गंगा दशहरा, निर्जला एकादशी जैसेअन्य कई महत्वपूर्ण व्रत एवं त्योहार होंगे.

ప్రశ్న శాస్త్రం గురించి ........

నిర్జల ఏకాదశి తేదీ 17-6-2024 సోమవారం

  జ్యేష్ఠ మాసంలో వచ్చే నిర్జల ఏకాదశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. ఈ ఉపవాసం జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం ఏకాదశి నాడు ఆచరిస్తారు. పాండవ సోదరులలో ఒకడైన భీముడు ఈ నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నాడని నమ్ముతారు. అందుకే దీనిని భీముడి ఏకాదశి అని కూడా అంటారు. నిర్జల ఏకాదశి రోజున ఆహారం, నీరు తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. ఇలా చేయడం ద్వారా  విష్ణువు  తన భక్తులకు సుఖసంతోషాలు సౌభాగ్యాలు ప్రసాదిస్తాడని నమ్ముతారు. నిర్జల ఏకాదశి వ్రత కథ పాండవ సోదరులలో భీముడు ఆహార ప్రియుడు. ఒక్కపూట కూడా భోజనం చేయకుండా ఉండలేడు. ఒకసారి తన సోదరులు, తల్లి ఏకాదశి ఉపవాసం ఉంటారని కానీ నెలలో రెండు రోజుల కూడా తాను ఉపవాసం ఉండడం చాలా కష్టంగా ఉంటుందని భీముడు వేదవ్యాసుడికి చెప్తాడు. స్వర్గాన్ని పొందడానికి మోక్షమార్గం లభించేందుకు సంవత్సరానికి ఒకసారి ఆచరించే ఉపవాసం ఏముందని భీముడు వేద వ్యాసుడిని అడిగాడు. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి నాడు నీరు తీసుకోకుండా ఉపవాసం నుండి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం, దానం చేస్తే మోక్షం లభిస్తుందని వ్యాసుడు చెప్పారు. అలా భీముడు నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా  ఉపవాసం

త్వరగా వివాహాలు కలిగించే యోగాలు (కలయికలు )

మొదటి కలయిక: శుక్రుడు మరియు బృహస్పతి ఒక వ్యక్తి యొక్క జాతకంలో 1వ, 5వ, 7వ, 9వ మరియు 11వ గృహాలలో బాగా ఉంచినట్లయితే, ఇది సంతోషకరమైన వైవాహిక జీవితానికి వ్యక్తి యొక్క జాతకంలో అనుకూలమైన కలయికలలో ఒకటి. ఇక్కడ 1 వ ఇల్లు స్వయం, 5 వ ఇల్లు ప్రేమను సూచిస్తుంది, 7 వ ఇల్లు జీవిత భాగస్వామిని సూచిస్తుంది, 9 వ ఇల్లు వైవాహిక జీవితం నుండి వెలువడే అదృష్టాన్ని వర్ణిస్తుంది మరియు 11 వ ఇల్లు కోరికల నెరవేర్పును సూచిస్తుంది. రెండవ కలయిక: బలమైన 7వ ఇంటితో పాటు ప్రయోజనకరమైన మహాదశ ఆరోగ్యకరమైన వైవాహిక జీవితాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి మకరరాశి లగ్నంగా ఉంటే, 7వ గృహాధిపతిగా చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటే, శుక్రుని యొక్క మహాదశ వ్యక్తికి పనిచేస్తుంటే, శుక్రుడు 1, 2, లలో బలమైన స్థానంలో ఉన్నాడు. 4, 5 మరియు 11 వ గృహాలలో, శుక్రుని మహాదశ వ్యక్తికి చాలా మంచి వైవాహిక జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మూడవ కలయిక: బృహస్పతి యొక్క అంశం మీ 7వ ఇంటిపై లేదా దాని అధిపతిపై ఉంటే, స్థానికుడు అనుకూలమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటాడు. అలాగే, అనుకూలమైన మహాదశ సంభవిస్తే, అది మరింత అదృష్టాన్ని జోడిస్తుంది మరియు వ్యక్తికి అత్యంత అన

హిందూ దేవాలయాలలో భక్తుల కు నియమాలు

వ్యవసాయ ముహూర్తాలు తెలుసుకోండి.

మృగశిర కార్తె 7-6-2024 నుండి ప్రారంభ0

  మృగశిర కార్తె రోజు ఇది తప్పకుండా తినాలి మృగశిర కార్తె రోజు కొన్ని ప్రాంతాల ప్రజలు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును, మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును, మృగశిరకు ముల్లోకాలు చల్లబడును అంటుంటారు మన పెద్దవాళ్లు

బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసం జ్యేష్ఠ మాసం ప్రారంభ0 తేదీ 7-6-2024 శుక్రవారం

 బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.ఈ మాసంలో చేసే విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే నీళ్ళను దానం చేయడం వలన చాలా ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి.జ్యేష్ఠ శుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజించడమే కాదు, దానాలకు శుభకాలం. ముఖ్యంగా అన్న దానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠశుద్ద దశమిని దశపాపహర దశమి అంటారు. అంటే పది రకాలను పాపాలను పోగొట్టే దశమి అని అర్ధం. పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం, లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితాన్నిస్తుంది. నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వేయాలి. ఈ రోజున ఇష్ట దైవాన్ని పూజించి ఆలయాల సందర్శిస్తే శుభం జరుగుతుంది.జ్యేష్ఠ శుద్ద ఏకాదశినే నిర్జల 'మతత్రయ' ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు ప

Vaikuntam means.....?

What to do on Amaavasya day

ధర్మ సింధు ప్రకారం గర్బిణి స్త్రీలు పాటించవలసిన నియమాలు

ఈరోజు వైశాఖ మాస బహుళ ఏకాదశి

  వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి. కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం, నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది. సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు. అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.