యోగిని ఏకాదశిని. ఇది హిందూ మతం ప్రధాన ఏకాదశిలో ఒకటి. ఈ ఉపవాసంలో విష్ణువును పూజిస్తారు.యోగిని ఏకాదశి రోజు కుదిరిన వారు గంగా స్నానం చేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటానని సంకల్పించుకోవాలి. అనంతరం దేవాలయంలో కానీ ఇంట్లో కానీ తులసి దళాలతో అర్చించాలి. విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలకు గంగా జలంతో అభిషేకం చేయాలి. ఆవు నేతితో దీపం వెలిగించాలి. చామంతులు, మల్లెలతో అర్చన చేయాలి. తమలపాకులు, అరటి పండ్లు, కొబ్బరికాయ మొదలైనవి అర్పించాలి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన చక్రపొంగలి నైవేద్యంగా సమర్పించాలి.ఈ రోజు పూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా పాపాల నుండి విముక్తి పొందవచ్చు. యోగిని ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
ఉడికించిన ఆహార పదార్థాలు తీసుకోవడం ఏకాదశి ఉపవాసంలో నిషిద్ధం.ద్వాదశి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు. మద్యపానం నిషిద్ధం. బ్రహ్మచర్యం పాటించాలి.
Comments
Post a Comment