Skip to main content

నాగ చవితి 5-11-2024 మంగళ వారం

 This festival is dedicated to the worship of Naga Devatas, or serpent gods, and is observed on the fourth day (Chaturthi) after the new moon in the month of Kartika, which typically falls in October or November. In 2024, Nagula Chavithi will be celebrated on November 5.

కార్తీక మాసంలో హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ నాగుల చవితి.వివాహిత స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి గుడికి వెళ్ళి నాగదేవతకు పూజలు చేస్తారు. పుట్టలో పాలు పోసి తమ కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. శ్రేయస్సు కోసం నాగదేవతల ఆశీస్సులు కోరుతూ పూజ చేస్తారు.పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, నైవేద్యం వంటివి నాగదేవతలకు సమర్పిస్తారు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకునే వాళ్ళు నాగ ప్రతిమ లేదా మట్టితో చేసిన ప్రతిమను ప్రతిష్టించుకుని పూజ చేసుకోవచ్చు.   నాగదేవతలను దర్శించుకుని పుట్టలో పాలు పోస్తారు. సర్పదేవతలకు పండ్లు, పువ్వులు, కుంకుమ సమర్పిస్తారు. ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తారు. మహిళలు తమ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పుట్ట చుట్టూ రక్షా సూత్రం కడతారు. 

పఠించాల్సిన శ్లోకం 

నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించడం వల్ల బాధలు, దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని అంటారు. 

కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ 

రుతుపర్ణస్య రాజ కీర్తనం కలినాశనమ్ 

Comments

Popular posts from this blog

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెంద...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.