Skip to main content

ఆకాశ దీపం అంటే..........

 దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం'వెళ్లాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశదీపం పితృదేవతలకు మార్గాన్ని చూపుతుంది. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి  ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి ఓ కారణం వుంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీకపురాణం చెబుతోంది. 

దీపం జ్యోతిః పరం బ్రహ్మ, దీపం సర్వ తపోమహం :దీ పే న సాధ్యతే సర్వం 

దీప లక్ష్మీ నమోస్తుతే ;; 

కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

ఆకాశదీపం శివ కేశవుల తేజస్సు జగత్తుకు అందిస్తుంది. ఆకాశదీపం మరో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే శివ కేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తభం పై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు.
 దీపాన్ని వెలిగిస్తూ ''దామోదరమావాహయామి'' అని ''త్రయంబకమావాహయామి'' అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట రెండు దీపాలు శివకేశవుల పేరుతో వెలిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివకేశవుల్లో ఏవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానిచాలి. ఇలా శివకేశవుల తెజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునందిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలిపోతాయి. కాంతి వలే మనలో ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వలనం అవుతుంది అని అర్థం. 
దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీకమాసం ప్రారంభం కూడా ఆకాశదీపంతోనే జరుగుతుంది. ఆకాశదీపం ప్రాధాన్యత... ఆకాశదీపం వెలిగించినా, దీపంలో నూనె పోసినా, ఈ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్నా పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి.  అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతుష్టులవుతారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఆకాశదీపం వెలిగించ వచ్చు. దీపానికి పూజచేసి దీప, ధూప నైవేద్యాలు సమర్పించి శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశదీరం వెలిగించి ఎత్తుగా ఒక కర్రకట్టి దానికి వేలాడదీయ వచ్చు. 

Comments

Popular posts from this blog

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెందినట్టుగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో ఆబ్దిక సమయంలో కొన్ని నియమాలను తప్పని సరిగా పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆబ్దిక సమయంలో యజమాని ఉత్తరీయం ధరించకూడదు. అలాగే ఆయన