వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు. అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. గురువు ప్రత్యేకత ఏ వ్యక్తికైనా మొదటి గురువు తల్లే. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి... ఏది మంచో, ఏది చెడో చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ . గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. ఆదిగురువు వ్యాసుడే అప్పటి వరకూ మౌఖికంగా ఒకరి నుంచి ఒకరికి సాగిన వేదజ్ఞానాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చి నాలుగు విభాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడు ఎంతో కృషి చేశాడు. పంచమ వేదంగా పేరు తెచ్చుకున్న మహా భారతాన్ని మనకు అందించిన వ్యాస భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఆ రోజును గురు పౌర్ణిమ లేదా వ్యాసపూర్ణిమగా పాటిస్తున్నారు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com