Skip to main content

Posts

3-8-2019 శనివారం నాడు గోదాదేవి తిరునక్షత్రం

  విశిష్టాద్వైత మత ప్రచారకులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్‌ అమ్మవారి తిరునక్షత్రo . గోదా దేవి తిరునక్షత్రం ఈ రోజు .  ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.   అంటే ఆవిడ విష్ణు చిత్తుల వారికి ఈ రోజున తులసి వనంలో దొరికింది .  నిజానికి భూదేవి ఆండాళ్ గా జన్మించిందని చెబుతారు.  అందుకే ఈ రోజు అన్ని వైష్ణవాలయాలలో ఆండాళ్ తిరునక్షత్రం విశేషంగా జరుపుతారు . తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి, ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...

ఏకాదశి 7-2-2021 ఆదివారం

 7-2-2021  ఆదివారం నాడు ఏకాదశి. ఈ రోజు ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా  ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేల పిండిని తినే ఆచారము ఉన్నది పేలాలలో బెల్లాన్ని,  యాలకు లను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని  ప్రసాదం  కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. హేమంత ఋతువు   ముగిసి వసంత   ఋతువు  ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక,  వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది

ఆడపిల్ల మొదటి సారి రజస్వల లేదా పుష్పావతి అయినప్పుడు ఏమి చేయాలి...

ప్రకృతికి దగ్గరగా , ప్రకృతితో కలిసి నడవాలని చెప్పే ఆచరణీయమైన , ఆదర్శనీయమైన విషయం చెబుతుంది. అందుకు ఇటీవల అందరూ మట్టి పాత్రలపై దృష్టి సారించారు . పసుపు పవిత్రతకు చిహ్నంగా భావిస్తాం. యాంటీబయోటిక్‌ అని ఆధునిక పరిశోధకులూ గుర్తించారు. బోనంలో ఉన్న ఆహారం శుద్ధిగా ఉండాలనే కుండ చుట్టూ పసుపు రాస్తారు. అమ్మ వారి ఆహార్యం , ఆచరించే నియమాలు.. అన్నింట్లో శాస్త్రీయత ఇమిడి ఉందని ఉస్మానియా విశ్వవిద్యాయంలో బోనాలపై పీహెచ్‌డీలు చేసిన విద్యార్థులు వెల్లడిస్తున్నారు.   బోనంలో ఉండే పసుపన్నం వల్ల కాలేయ సమస్యలు రావని వైద్యులు తెలిపారు. ఇలాంటి సామూహిక వేడుకల్లో పసుపన్నం తినడం వల్ల ఎలాంటి జీర్ణకోశ సమస్యలు రావు. గాల్‌బ్లాడర్‌ పనితీరు మెరుగవుతుంది. మెదడు     చురుకవుతుంది.   బోనం అలంకరణలో , సాక కోసం పసుపు నీటిలో వేపాకును ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో కీలకంగా వాడే వేపాకు వల్ల గాలి శుద్ధి అవుతుంది. తలనొప్పి తగ్గుతుంది , కంటి సంరక్షణకు తోడ్పడుతుంది. క్యాన్సర్‌ , ప్లూ జ్వరాలు తగ్గించే గుణం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తేది 16-7-2019 మంగళ వారం నాడు గురు పౌర్ణమి. వేదం వ్యాసుని పుట్టిన రోజు.  వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’ సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం . వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ వశిష్ట మహర్షికి మునిమనువడు, శక్తికి మనువడు, పరాశర మహర్షికి పుత్రుడు, శుకమహర్షికి తండ్రి, నిర్మలుడు తపోనిదియైన మహర్షికి  నమస్కారం. అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః భావం : బహు జన్మల నుండి సంప్రాప్తించిన పాప పుణ్యములు జ్ఞానమను అగ్ని చేత దహింపజేయునట్టి గురువునకు నమస్కరిస్తున్నాను . త్రికరణము లచే హింస చేయని వాడును, సత్యశౌచాదులు కలవాడు, సమస్త జీవ రాశుల యందు దయ కలవాడు, శాంత    చిత్తం కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తులు గల వాడు, వేద సంపన్నుడు , పరమభక్తుడు, యోగమును ఎరిగిన వాడు, యోగ నిష్ఠ యందున్నవాడు ,సదా యోగాత్మ స్వరూపుడై బహిరంతర శుద్ధి కలవాడు, జ్ఞానము , యోగము,చర్య, క్రియ, అను నాలుగు పాదాంతముల పర్యంతము శ...

భాగవత్ గీత లోని పురుషోత్తమ యోగము,15వ అధ్యాయము.

తద్దినం పూజ సామాన్

ప్రథమ సంవస్చరం  – సంకల్ప  విధానం పూజ సామగ్రి  నల్లని నువ్వులు 100 grams, , బియ్యము 5 కిలోలు  ,    తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి  100 grams ,5 పాకెట్లు  ,పెరుగు డబ్బాలు 5 చిన్నవి, బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు), ఆవు పాలు, ఆవు మూత్రం, ఆవు పేడ కొంచెం, గందం కొంచెము  , మోదుగ ఆకు    విస్తార్లు 20 , దొప్పలు 10, రూపాయి బిళ్ళలు, 15, రాగి చెంబు 1, రాగి గ్లాస్ 1, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1 డజన్  ,తేనె,ఫోటో కు   పూల మాల, కుల్లా     పూలు, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్, అయ్యగారికి ఆకు కూరలు కిలో , చింతపండు కిలో , ఉప్పు కిలో ,బెల్లం కిలో ,మిరపకాయలు  కిలో,ఎండు మిర్చిపొడి కిలో,   జీలకర్ర,1/4 కిలో, మిరియాలు,1/4 కిలో, ధనియాలు,1/4 కిలో,clothes dothi, kanduva.   రాచకొండ mobile no: 9989324294 అయ్యగారి దక్షిణ 2,౦౦౦/-
నవగ్రహదోషాలు: జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్నస్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు వస్తాయి. ఎటువంటి దోషాలకైనా పలు శాస్ర్తాల్లో చెప్పిన సులభోపాయాన్ని చూద్దాం.. గోవు అంటే దేశీయ ఆవు ద్వారా మనకు నవగ్రహదోషాలను తొలిగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారు. సప్తరుషులు,నదలు, తీర్థములు గోవులో ఉంటాయి. గోపాదల్లోనూ ధర్మార్థకామమోక్షములు ఉంటాయి. ఆవుకాళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. అయితే గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహదోషాలు తొలిగిపోతాయి. భక్తితో, ఇష్టదేవతానామస్మరణతో గోధూళిలో నిలబడాలి. ఇలాకొన్ని రోజులుపాటు చేస్తే తప్పక నవగ్రహదోషాలు పోతాయి. అదేవిధంగా గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు కలుగుతాయి. గోపూజకు భక్తి ప్రధానం,మడి ప్రధానం కాదు. సూక్ష్మంలో మోక్షం పొందాలంటే గోపూజ,గోదానం, గోసేవ చేసుకోండి తప్పక విశేష ఫలితాలు లభిస్తాయి. గోవుకు సంబంధించిన పలు విషయాలను అనుశాసన పర్వంలో వ్యాసుడు పలు విషయాలను వివరించారు. గోధూళివేళ స్వదేశీ గోవులు ఉన్నచోట నిలబడం...
జై శ్రేమన్నారాయణ .తేది :28-6-2019 శుక్రవారం కట్టే కోలా ఏకాదశి.ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి లేదా స్మార్త వైష్ణవ ఏకాదశి అని  కూడా అంటారు. దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు. అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శపిస్తాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగుతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి జ్యేష్...

Importance of Ashada Masam | Dharma sandehalu - Episode 462_Part 1