పసుపు 100౨౫౦ గ్రాములు, కుంకుమ ౧౦౦ గ్రాములు, శ్రీ గంధము 1 చిన్న డబ్బా, బియ్యము ౩ కిలోలు, మామిడి ఆకులు, తమల పాకులు ౨౦౦, నల్లని పోక వక్కలు ౨౫, కర్జూరము కాయలు ౨౫, బాదము పలుకులు ౨౦౦ గ్రాములు, ఖాజు పలుకులు ౨౦౦ గ్రాములు, ఆవు పాలు, ఆవు పాల పెరుగు, మంచి తేనె ౫౦౦ గ్రాముల సీస , ఆవు నెయ్యి కిలో, బెల్లము ౫౦౦ గ్రాములు, అరటి పండ్లు ౨ dozen , green గరిక ౨ కట్టలు, తెల్లని వస్త్రము అంచుతో ఉండాలి ౧, జాకెట్టు పీసులు ౨ , నూనె దీపాలు ౨, వతులు, అగ్గిపెట్టె ౧, అగర్బతి, కర్పూరము ౧ పాకెట్టు, ఎందు కొబ్బెరలు ౨ , కొబ్బరి కాయలు ౨, కొబ్బరి బోండము ౧, పూల దండలు ౨, కుల్ల పూవులు ౫౦౦ గ్రాములు, ఉండ్రాళ్ళు 21, రాగి కలషములు ౨, దారము బంతి ౧, మట్టి చిప్పలు ౬ , చాపలు ౩ , ,చిల్లర పైసలు ౧౫, గంధము చెక్క ౧, ద్రాక్ష ౨౦౦ గ్రాములు, , చెరుకు ముక్కలు ౨౧.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment