పసుపు ౨౦౦ గ్రాములు, కుంకుమ ౧౦౦ గ్రాములు, శ్రీ గంధం , బియ్యము ౩ కిలోలు, రాచ గుమ్మడి కాయ ౧ , బూడిద గుమ్మడి కాయ ౧ , టెంకాయలు, ఆవాలు ౧౦౦ గ్రాములు, సున్నము డబ్బా, మామిడి కొమ్మలు, తమల పాకులు ౧౦౦, వక్కలు ౨౫, కజూరము, ౨౫ బాదము పలుకులు, కాజు,కిస్స్మిస్స్,అరటి పండ్లు ౨ దజానులు, తెల్లని వస్త్రము, జాకేటు బట్టలు, కొబ్బరి కుడుక ౧, కలశం చెంబులు ౨, గ్లాసులు ౫ చిన్నవి, ఆవు పంచితము , కొత్త ఇతడి గిన్నె ౧ ఆవు పాలు లీటరు , ఫోటో, మంగళ హారతి, కర్పూరము, అగర్బతి, దక్షిణ ౨,౦౦౦/-
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment