ప్రాణులన్నీ కాలానికి కట్టుబడి ఉంటాయి. ఎప్పుడు
దుర్బుద్ధి కల్గి దుర్మార్గానికి
సిద్ధమౌతారో అప్పుడే వారికి కాలం తీరిందని అర్థం. ఆపదలను తొలగించే మంత్రోపాసన
పాపాలు హరించే తీర్థ యాత్రలు కోరికలు తీర్చే దైవం, శుభాశుభాలు చెప్పే జ్యోతిష్యుడు,
అనారోగ్యాన్ని పోగొట్టే ఔశదం జ్ఞ్యాన మార్గాన్ని తెలిపే గురువు, వీరిపట్ల విశ్వాసం కలిగి ఉండాలి. వీరి వలన మంచి కలుగుతుందని
విశ్వసించాలి. “ విశ్వాసహ: సంపదా మూలం “ అన్నారు పెద్దలు.Mobile No:9989324294
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment