గృహారంభ సమయం, భూపరీక్షా విధానం మత్స్య పురాణంలో గృహ నిర్మాణాలు ఏ మాసంలో చేస్తే ఏ ఫలితమో కూడా సూతుడు పేర్కొన్నాడు. గృహారంభానికి చైత్ర మాసం వ్యాధి ప్రదం; వైశాఖ మాసం ధన, రత్న ప్రదం; జ్యేష్ఠం మృత్యుకరం; ఆషాఢం భృత్య, రత్న, పశువృద్ధికరం; శ్రావణం భృత్య, లాభం; భాద్రపదం హానికరం; ఆశ్వయుజం పత్నీ నాశకరం; కార్తీకం ధన, ధాన్య వృద్ధికరం; మార్గశిరం అన్న వృద్ధికరం; పుష్యం చోర భయప్రదం; మాఘం బహులాభ దాయకం; ఫాల్గుణం కాంచన బహుపుత్ర ప్రధమని సూతుడు చెప్పాడు. ఇల్లు కట్టుకోవటానికి తగిన భూమిని పరీక్షించే పద్ధతిని కూడా ఇక్కడే వివరించాడు సూతుడు. గృహ నిర్మాణానికి ఎంచుకున్న భూమిని పరీక్షించాలనుకున్నప్పుడు పిడిమూక లోతు, అంతే పొడవు వెడల్పుతో చక్కగా ఒక గుంటను తవ్వాలి. ఆ గుంటను బాగా అలకాలి. ఒక పచ్చి మూకుడు తెచ్చి దానిలో నెయ్యి పోసి నాలుగు దిక్కులలో నాలుగు వత్తులను ఆ మూకుడులో ఉంచి వెలిగించి పొయ్యి మధ్యన ఉంచాలి. ఏ దిక్కున ఉన్న వత్తి బాగా కాంతితో వెలుగుతుందో గమనించాలి. తూర్పు దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే ఆ భూమి విప్రులకు అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్న వత్తి బాగా వెలిగితే క్షత్రియులకు, పడమటది వైశ్యులకు...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com