శ్రీమంతమునకు పూజ
సామగ్రి
పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, గంధం చూర్ణము డబ్బా, మంచి బియ్యం 3 కిలోలు, తమల పాకులు 35, నల్లని పోక వక్కలు 25, కర్జూరం పండ్లు ప్యాకెట్, ఆచమనం పాత్ర, రాగి చెంబు, మామిడి కొమ్మ, కొబ్బరి కాయ 1, ఎండు కుడుక, తెల్లని వస్త్రం (బంగారం వర్ణపు అంచుతో ) కనుము బట్ట, స్టీల్ గ్లాసులు
చిన్నవి 5, అయిదు రకముల పండ్లు ( సుమంగళి స్త్రీలకూ దానం ), అరటి పండ్లు ½ డజన్, అగర్బతి, కర్పూరం, విడి పూలు, మల్లెల దండలు, కనకాంబరాలు దండలు, ఆవు పేడ,ఆవు పంచితం, రూపాయి నాణెములు 15, దువ్వెన 1, గోధుమ మొలకెత్తిన ధాన్యముల దండ 1, మేడి పండ్లు 3, మంగళ హారతి 1. వీణ వాదన గానం చేయించాలి. దంపతులకు బ్రాహ్మణ మరియు బందువుల ఆశీర్వచనం. ఆ తర్వాత బ్రాహ్మణ భోజనం మరియు దక్షిణ.
Comments
Post a Comment