కూరత్తాళ్వారు వారి కుమారులు పరాశర
భట్టార్ మరియు వేద వ్యాస భట్టార్
పిల్లలకు సాధారణంగా పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు పెడతారు. పిల్లలను పిలిచే కారణంగానైనా మనం పెరుమాళ్ ఇంకా ఆచార్యుల
యొక్క దివ్య పేర్లను ధ్యానించే అవకాశం లభిస్తుంది. పెరుమాళ్ లేదా ఆచార్యుల పేర్లు
పెట్టడానికి కారణం ఖచ్చితంగా ఇదే, వారి పవిత్రమైన పేర్లను పిలుస్తూ ఆచార్యుల మరియు పెరుమాళ్ల
కళ్యాణ గుణాలను ధ్యానించే అవకాశం పొందుతాం. లేకపోతే, ఈ బిజీ ప్రపంచంలో, ప్రత్యేకంగా ఆచార్యులు ఇంకా పెరుమాళ్ యొక్క దివ్య నామాలను
ధ్యానించేందుకు సమయం కేటాయించడం కష్టం. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి. ప్రజలు అర్ధం లేని నామమాత్రపు పేర్ల వెనుకబడి, పెరుమాళ్, తాయార్ మరియు ఆచార్యులను గుర్తుంచుకోవటంలేదు.
Comments
Post a Comment