మాఘ మాసం లో ఈ మౌని అమావాస్య ఒకటి. దీనిని మాఘీ అమావాస్య అని కూడా అంటారు. 'మౌని' అనేది సంస్కృత పదం.‘మౌన్’ నుంచి మౌని అనే పదం వచ్చింది. మౌని అంటే అర్థం ‘సంపూర్ణ నిశ్సబ్దం’. అందుకే ఈరోజున పూజలు చేసేవారంత మౌనవ్రతం చేస్తారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు.
పవిత్ర నగరాలైన హరిద్వార్, ప్రయాగ్రాజ్ మరియు గంగా నదులలో ఈరోజున వేలాది మంది భక్తులు వచ్చి స్నానమాచరిస్తారు. మౌని అమావాస్య ని జ్ఞానంను నిద్రలేపే చర్యగా భావించి, దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. ఏమీ చెప్పవలసిన అవసరం కానీ, చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని నమ్ముతారు. మౌని అమావాస్య రోజును మాఘి అమావాస్య అని కూడా అంటారు.అమ అంటే చీకటి అని అర్థం. అలాగే వాస్య అంటే కామం. అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకడం. దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలనేది. చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతుంటారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు మనకు కనిపించడు. ఈ రోజు మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను కలిగించవు అని అంటుంటారు.
పితృపూజ..
పితృపూజ చేయటానికి మౌని అమావాస్య మంచిరోజు. ఈరోజు మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని, వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ, వారి ఆశీస్సులు పొందుతారు.
Comments
Post a Comment