ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి ని అమలై కాదశి అని అంటారు. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. వివిధ ఆహార దినుసులు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. చంద్రుడు ప్రభావం మన దేహంపై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. భగవంతునికి నివేదిన పెట్టిన తరువాతనే భుజించాలి. భగవంతుడు అంటే సర్వమూ ఇచ్చేవాడు. కాబట్టి పరమాత్మకు నివేదించకుండా తినగూడదు అని పెద్దల వచనం. అన్న ప్రసాదం వ్యర్ధం చేయడం మహా మహా పాపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆకలి ఉన్నవాడికి పెట్టి మనం తినాలి అని శాస్త్రాలు గోషిస్తున్నాయి.
హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని , ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు , ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా , అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై , సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి , భవిష్యత్ దంపతులుగా , కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ , జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో , ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...
Comments
Post a Comment