తెలుగు నెలల్లో చివరి నెల అయిన ఫాల్గుణ మాసంలో అంటే ఏప్రిల్ 1 తేదీన శుక్రవారం నాడు ఫాల్గుణ అమావాస్య వచ్చింది.ఈ పవిత్రమైన రోజున నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి అనేక సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. ఈ అమావాస్య పూర్వీకులకు అంకితం ఇవ్వబడింది.ఫాల్గుణ అమావాస్య రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులందరూ ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదులలో స్నానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున స్నానమాచరించి దానధర్మాలు చేయాలి. ఈరోజున ఉపవాసం ఉంటూ పూజలు చేస్తే పూర్వీకుల మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.పేదలకు వస్త్రాలను దానం చేయాలి. అలాగే ఈరోజున పూర్వీకులకు తర్పణం చేయాలి. * ఈరోజున పూర్వీకులను సంత్రుప్తి పరిస్తే.. మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి.
చేయకూడనివి.. * ఈ ఫాల్గుణ అమావాస్య రోజున పగటిపూట పొరపాటున కూడా నిద్రపోకూడదు. * ఈరోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసం, ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. * ఈరోజున నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించాలి. * ఈరోజున కచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాలి. కలయికలో పాల్గొనకూడదు. * ఈరోజున కోపంగా ఉండకూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి.
Comments
Post a Comment