గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిథి . అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితి (19-5--2022 గురు వారం నాడు ) గా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.సంకటాలు నివారణకై పచ్చి గరిక తో పూజలు,అభిషేకం,అర్చనలు , గణపతి నైవేద్యాలు, గణపతి ఉపనిషద్ పారాయణం చేయటం,అష్టకాల పారాయనాలు , గ కార సహస్ర నామo చాలా మంచిది.
Comments
Post a Comment