పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం రావడంతో ఈ మాసాన్ని ఆషాఢం అని పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోని ప్రవేశించడంతో దక్షిణాయణం మొదలవుతుంది. ఈ మాసంలో వర్షాలు కురుస్తాయి. రోగాలు ప్రబలే కాలం కూడా కావడంతో ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. ముఖ్యంగా పెళ్లి, నిశ్చితార్థ వేడుకలు, ఉపనయనం, గృహప్రవేశం వంటి వేడుకలు నిర్వహించరు. ఇక ఈ సంవత్సరం ఆషాఢ మాసం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూన్ 19న మొదలుకాబోతోంది. ఆషాఢమాస శుక్ల పక్షం జూన్ 19న మొదలై జూలై 3న ముగుస్తుంది. ఆషాఢ మాస బహుళ పక్షం జూలై 4 మొదలై జూలై 17న ముగుస్తుంది.
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ మాసంలోనే భక్తులు చాతుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. శుక్ల ఏకాదశి నుంచి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. భక్తులు ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ మాసంలో పూరీ రథయాత్ర, కుసుమహర జయంతి, సికింద్రాబాద్ బోనాల జాతర, స్కంద షష్ఠి, ప్రదోష వ్రతం, సంకష్టహర చతుర్థి వంటి పండుగలను జరుపుకుంటారు.
Ashadam : ఆషాడమాసంలో అత్తా,కోడలు ఒకే గడప ఎందుకు దాటకూడదు?
ఇక ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన జంటలు దూరంగా ఉండాలి అంటారు.. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే 9 నెలల తర్వాత అంటే వేసవికాలంలో ప్రసవం జరుగుతుంది. ఆ సమయంలో పుట్టే శిశువు ఎండవేడిని తాళలేరని ఈ మాసంలో కొత్తగా పెళ్లైన జంటల్ని దూరం పెడతారు. ఇక ఆడవారు ఎంతో ఇష్టం గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు గౌరీదేవికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్యాలు దరి చేరవని మరీ ముఖ్యంగా గర్భాశయ, చర్మ సంబంధ రోగాలు రావని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే మహిళలు ఎంతో శ్రద్ధగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇలా ఈ మాసానికి ఇటువంటి విశిష్థతలు ఉన్నాయి
Comments
Post a Comment