ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి రోజున అనంత చతుర్ధశిని జరుపుకుంటారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 28 అనంత చతుర్దశిని జరుపుకోబోతున్నాం. హిందూ సాంప్రదాయం లో అనంత చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణువు 14 లోకాలను సృష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. హృదయపూర్వకంగా భగవంతుడిని ధ్యానిస్తూ ఎవరైతే ఈ రోజు ఉపవాసం ఉంటారో వారికి అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని.. అన్ని వ్యాధులు నయమవుతాయని విశ్వాసం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి, కుటుంబ సమస్యల నుంచి బయటపడడానికి అనంత చతుర్దశి రోజున ఉపవాసం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అనంత చతుర్దశి పూజా విధానం ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం పూజ గదితో సహా మొత్తం ఇంటిలో గంగాజలంతో శుద్ధి చేయాలి. దీని తరువాత పూజా స్థలంలో ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు వస్త్రాన్ని పరచి, విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్టించండి. దీని తరువాత, ధూపం, దీపం, నైవేద్యం, పరిమళం, చందనం సమర్పించి .. మహావిష్ణువుని పూజించి చివరకు ...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com